Balakrishna: NBK107 క్రేజీ అప్డేట్.. అధికారికంగా ప్రకటించిన చిత్ర నిర్మాతలు!

నందమూరి నటసింహం బాలకృష్ణ "అఖండ" సినిమాతో భారీ విజయాన్నే అందుకున్నాడు. ఇప్పుడు ఆ సక్సెస్ ని అలాగే కంటిన్యూ చేయాలంటూ, జాగ్రతగా సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు, సినీవర్గాల్లో కూడా మంచి హైప్ నెలకుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ పై చిత్ర నిర్మాతలు కీలక ప్రకటన చేశారు.

Balakrishna: NBK107 క్రేజీ అప్డేట్.. అధికారికంగా ప్రకటించిన చిత్ర నిర్మాతలు!

Balakrishna Movie Title Announcement Date released

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ “అఖండ” సినిమాతో భారీ విజయాన్నే అందుకున్నాడు. ఇప్పుడు ఆ సక్సెస్ ని అలాగే కంటిన్యూ చేయాలంటూ, జాగ్రతగా సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు, సినీవర్గాల్లో కూడా మంచి హైప్ నెలకుంది.

Balakrishna: అన్‌స్టాపబుల్ బాలయ్యను వెనకుండి నడిపిస్తున్న కూతురు!

ఇటీవలే చిత్ర యూనిట్ ఈ మూవీ యొక్క టర్కీ షెడ్యూల్ పూర్తీ చేసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. “NBK107” వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘రెడ్డి గారు’, ‘నరసింహ్మ రెడ్డి’ అంటూ పలు టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ పై చిత్ర నిర్మాతలు కీలక ప్రకటన చేశారు.

ఈ నెల 21న సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తున్నట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ మెరవనుంది. ప్రతినాయకుడిగా కన్నడ నటుడు దునియా విజయ కనిపించనున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.