Balakrishna: అన్‌స్టాపబుల్ బాలయ్యను వెనకుండి నడిపిస్తున్న కూతురు!

నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేసిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో తొలి సీజన్ ఎలాంటి ట్రెమెండస్ విజయాన్ని అందుకుందో మనం చూశాం. బాలయ్య లాంటి స్టార్ హీరో యాంకరింగ్‌తోనూ ప్రేక్షకులను మెప్పించగలడని అన్‌స్టాపబుల్ షో నిరూపించడంతో మిగతా షోలను దాటి టాప్ టాక్ షోగా మారింది. ఇక ఇప్పుడు అన్‌స్టాపబుల్ రెండో సీజన్‌తో మరోసారి బాలకృష్ణ మనముందుకు రానున్నాడు.

Balakrishna: అన్‌స్టాపబుల్ బాలయ్యను వెనకుండి నడిపిస్తున్న కూతురు!

Balakrishna Daughter Tejaswini Key Role For Unstoppable 2

Balakrishna: నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేసిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో తొలి సీజన్ ఎలాంటి ట్రెమెండస్ విజయాన్ని అందుకుందో మనం చూశాం. బాలయ్య లాంటి స్టార్ హీరో యాంకరింగ్‌తోనూ ప్రేక్షకులను మెప్పించగలడని అన్‌స్టాపబుల్ షో నిరూపించడంతో మిగతా షోలను దాటి టాప్ టాక్ షోగా మారింది. ఇక ఇప్పుడు అన్‌స్టాపబుల్ రెండో సీజన్‌తో మరోసారి బాలకృష్ణ మనముందుకు రానున్నాడు.

Unstoppable 2: ఎక్కడ చూసినా బాలయ్య షో గురించే చర్చ.. నిజంగానే అన్‌స్టాపబుల్!

ఇప్పటికే అన్‌స్టాపబుల్ రెండో సీజన్ తొలి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షోతో ప్రేక్షకులను అలరించడంలో ఆయన కృషితో పాటు మరొకరి హ్యాండ్ కూడా ఉంది. బాలయ్య రెండో కూతురు నందమూరి తేజస్విని అన్‌స్టాపబుల్ టాక్ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వ్యవహిరంచారు. ఆమె తన తండ్రి లుక్స్, కాస్ట్యూమ్స్ వంటి విషయాలపై చాలా రిసెర్చ్ చేసి, మన ముందుకు అల్ట్రా స్టైలిష్ బాలయ్యను తీసుకువచ్చింది తేజస్విని. ఆమె అన్‌స్టాపబుల్ షో కోసం ఏ విధంగా కష్టపడిందో డైలాగ్ రైటర్ బీవీఎస్​ రవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Unstoppable 2 Promo: తండ్రీకొడుకులు కలిసి నా సంసారంలో నిప్పులు పోస్తున్నారు అంటోన్న బాలయ్య!

కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్ 2’ ప్రోమో మేకింగ్ వీడియోలోనూ మనకు తేజస్విని కనిపిస్తుంది. దీన్ని బట్టి ఆమె రెండో సీజన్ కోసం కూడా ఇంతగా కష్టపడుతుందా అని అభిమానులు అవాక్కవుతున్నారు. ఇక అన్‌స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్‌ను అక్టోబర్ 14 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుండగా, తొలి ఎపిసోడ్‌కు గెస్టులుగా నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లు వస్తున్నారు.