Unstoppable 2 Promo: తండ్రీకొడుకులు కలిసి నా సంసారంలో నిప్పులు పోస్తున్నారు అంటోన్న బాలయ్య!

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న పాపులర్ టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే రెండో సీజన్‌కు రెడీ అయ్యింది. ఈ టాక్ షోతో బాలయ్య మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతుండటంతో, ఈ టాక్ షో కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ టాక్ షో రెండో సీజన్ తొలి ఎపిసోడ్‌కు ఎవరు వస్తారా అనే అంశానికి తెరదించుతూ, తాజాగా నిర్వాహకులు ఈ టాక్ షో తొలి ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.

Unstoppable 2 Promo: తండ్రీకొడుకులు కలిసి నా సంసారంలో నిప్పులు పోస్తున్నారు అంటోన్న బాలయ్య!

Unstoppable 2 Episode 1 Promo With Chandrababu Naidu And Nara Lokesh

Unstoppable 2 Promo: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న పాపులర్ టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే రెండో సీజన్‌కు రెడీ అయ్యింది. ఈ టాక్ షోతో బాలయ్య మరోసారి తన సత్తా చాటేందుకు రెడీ అవుతుండటంతో, ఈ టాక్ షో కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ టాక్ షో టీజర్ ప్రేక్షకుల్లో దీనిపై అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే ఈ టాక్ షో రెండో సీజన్ తొలి ఎపిసోడ్‌కు ఎవరు వస్తారా అనే అంశానికి తెరదించుతూ, తాజాగా నిర్వాహకులు ఈ టాక్ షో తొలి ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.

Unstoppable 2 : 30 వేలమంది అభిమానుల మధ్య.. విజయవాడలో బాలయ్యబాబు అన్‌స్టాపబుల్ సీజన్ 2 లాంచ్..

అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 తొలి ఎపిసోడ్‌కు ముఖ్య అతిథులుగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ కలిసి వచ్చారు. ఇక ఈ ప్రోమోలో చంద్రబాబును అందరికీ బాబుగారు, తనకు బావగారు అంటూ బాలయ్య ఆహ్వానించిన తీరు భలే ఉండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాబుతో కలిసి బాలయ్య చేసిన సందడి మామూలుగా ఉండబోదని ఈ ప్రోమో వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇక బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్ హోస్ట్‌గా మారి తన తండ్రి, మామలను పలు ఆసక్తికర ప్రశ్నలు అడగ్గా.. తండ్రీ కొడుకులు కలిసి తన సంసారంలో నిప్పులు పొస్తున్నారు అంటూ బాలయ్య చేసిన కామెంట్ నవ్వులను పూయించింది.

Unstoppable 2: బాలయ్య టాక్ షోకు చంద్రబాబు.. ఇక అభిమానుల సంతోషం అన్‌స్టాపబుల్!

ఇక చంద్రబాబు రాజకీయ జీవితంలో పలు కీలక ఘట్టాలకు సంబంధించి కూడా ఈ ఎపిసోడ్‌లో బాలయ్య పలు ప్రశ్నలు అడిగాడు. మరి బాలయ్య ఈ టాక్ షోలో చంద్రబాబు, నారా లోకేశ్‌లను ఎలాంటి ప్రశ్నలు అడిగాడో తెలియాలంటే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే అక్టోబర్ 14 వరకు వెయిట్ చేయాల్సిందే.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.