Unstoppable 2: బాలయ్య టాక్ షోకు చంద్రబాబు.. ఇక అభిమానుల సంతోషం అన్‌స్టాపబుల్!

నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేసిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. బాలయ్య యాంకరింగ్ చేసిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ టాక్ షో సూపర్ సక్సెస్ అయ్యింది. అన్‌స్టాపబుల్ 2 టాక్ షోలో గెస్టులుగా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఓ టాక్ షోలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Unstoppable 2: బాలయ్య టాక్ షోకు చంద్రబాబు.. ఇక అభిమానుల సంతోషం అన్‌స్టాపబుల్!

Chandrababu Naidu As Guest In Balakrishna Unstoppable 2

Unstoppable 2: నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేసిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. బాలయ్య యాంకరింగ్ చేసిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ టాక్ షో సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు అన్‌స్టాపబుల్ రెండో సీజన్‌ను రెడీ చేస్తున్నారు షో నిర్వాహకులు. ఇటీవల దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు.

Unstoppable 2: దెబ్బకు థింకింగ్ మారిపోవాలి.. పండగకే బాలయ్య బాబు ల్యాండ్ అవుతున్నాడా..?

అయితే ఈసారి అన్‌స్టాపబుల్ 2 టాక్ షోలో గెస్టులుగా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో తొలుత మెగాస్టార్ చిరంజీవి పేరు బలంగా వినిపించింది. గత సీజన్‌లోనే మెగాస్టార్ అన్‌స్టాపబుల్ టాక్ షోకు వస్తాడని అందరూ ఆశించారు. కానీ, ఆయన రాకుండానే ఫస్ట్ సీజన్‌ను ముగించేశారు నిర్వాహకులు. దీంతో ఇప్పుడు రెండో సీజన్‌లో ఆయన్ను ఖచ్చితంగా తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ రెండో సీజన్ తొలి ఎపిసోడ్‌లో చిరు రావడం అనుమానంగా మారడంతో, ఇప్పుడు మరో సెలబ్రిటీని ఈ టాక్ షోకు గెస్టుగా తీసుకురాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

UnStoppable 2 : బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 రెడీ.. అధికారికంగా ప్రకటించిన ఆహా..

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఓ టాక్ షోలో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. బాలయ్యకు వియ్యంకుడు కావడంతో, ఆయన అన్‌స్టాపబుల్ 2 టాక్ షో తొలి ఎపిసోడ్‌కు వచ్చేందుకు అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ప్రకటన మాత్రం ఇప్పటివరకు రాలేదు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు బాలయ్య టాక్ షోకు వస్తే, అటు టీడీపీ అభిమానులకు, నందమూరి అభిమానులకు ఇది బ్రహ్మాండమైన న్యూస్ అని చెప్పాలి. వారి సంతోషానికి అవధులు లేకుండా పోతాయనేది వాస్తవం. మరి నిజంగానే బాలయ్య కోసం చంద్రబాబు అన్‌స్టాపబుల్ టాక్ షోకు వస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.