Unstoppable 2: దెబ్బకు థింకింగ్ మారిపోవాలి.. పండగకే బాలయ్య బాబు ల్యాండ్ అవుతున్నాడా..?

నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేసిన టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ టాక్ షోలో బాలయ్య ఎనర్జీకి అందరూ ఫిదా అయ్యారు. అయితే ఈ టాక్ షోకు రెండో సీజన్ కూడా ఉంటుందని గతంలోనే నిర్వాహకులు వెల్లడించారు. తాజాగా ‘అన్‌స్టాపబుల్ సీజన్ 2’కు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్‌ను ఆహా వెల్లడించింది.

Unstoppable 2: దెబ్బకు థింకింగ్ మారిపోవాలి.. పండగకే బాలయ్య బాబు ల్యాండ్ అవుతున్నాడా..?

Balakrishna Unstoppable 2 Update On AHA

Unstoppable 2: నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేసిన టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ టాక్ షోలో బాలయ్య ఎనర్జీకి అందరూ ఫిదా అయ్యారు. ఈ టాక్ షో స్ట్రీమింగ్ అవుతున్న సమయంలో భారీ వ్యూయర్‌షిప్‌ను నమోదు చేసుకుంది. ఇక ఈ షో నిర్వాహకులు బాలయ్య హోస్టింగ్‌ను చూసి అవాక్కయ్యారు. ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోను బాలయ్య హ్యాండిల్ చేసిన విధానానికి వారు స్టన్ అయిపోయారు. అయితే ఈ టాక్ షోకు రెండో సీజన్ కూడా ఉంటుందని గతంలోనే నిర్వాహకులు వెల్లడించారు.

UnStoppable 2 : బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 రెడీ.. అధికారికంగా ప్రకటించిన ఆహా..

అన్‌స్టాపబుల్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా.. తమ అభిమాన హీరోను మళ్లీ హోస్ట్‌గా ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘అన్‌స్టాపబుల్ సీజన్ 2’కు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్‌ను ఆహా వెల్లడించింది. త్వరలోనే ‘అన్‌స్టాపబుల్ 2’తో బాలయ్య మరోసారి గర్జించేందుకు సిద్ధమవుతున్నట్లుగా ఆహా తెలిపింది. ఇక ఈ టాక్ షో రెండో సీజన్‌ను అతి త్వరలోనే ప్రారంభిస్తామని.. దెబ్బకు థింకింగ్ మారిపోవాల్సిందే అంటూ ఈ షో గురించి ఓ అప్డేట్ ఇచ్చారు.

Unstoppable: దసరాకు బాలయ్య డబుల్ ట్రీట్.. ఇక అన్‌స్టాపబుల్!

పండగ మొదలయ్యేది అప్పుడే అంటూ ఈ టాక్ షో ప్రారంభం గురించి ఓ క్లూ కూడా ఇచ్చారు నిర్వాహకులు. దీంతో దసరా పండగకు ఈ టాక్ షో స్టార్ట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. ఇక ఈసారి బాలయ్య రెట్టింపు ఉత్సాహం, ఎనర్జీతో రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈసారి టాక్ షో మొదటి ఎపిసోడ్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని గెస్టుగా తీసుకురావాలని షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. మరి నిజంగానే దసరా పండగకే బాలయ్య బాబు అన్‌స్టాపబుల్ 2తో ల్యాండ్ అవుతాడా అనేది చూడాలి.