Unstoppable 2: ఎక్కడ చూసినా బాలయ్య షో గురించే చర్చ.. నిజంగానే అన్‌స్టాపబుల్!

నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా వ్యవహరించిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ప్రేక్షకులను ఏ విధంగా అలరించిందో అందరం చూశాం. ఈ టాక్ షోను బాలయ్య హోస్ట్ చేసిన విధానం సూపర్బ్ అంటూ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇక ఈ టాక్ షోలో బాలయ్య ఎనర్జీకి అభిమానులు ఫిదా అయ్యారు. అయితే తాజాగా ఈ టాక్ షో రెండో సీజన్‌కు సంబంధించిన తొలి ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Unstoppable 2: ఎక్కడ చూసినా బాలయ్య షో గురించే చర్చ.. నిజంగానే అన్‌స్టాపబుల్!

Unstoppable 2 Latest Promo Goes Viral

Unstoppable 2: నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా వ్యవహరించిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ప్రేక్షకులను ఏ విధంగా అలరించిందో అందరం చూశాం. ఈ టాక్ షోను బాలయ్య హోస్ట్ చేసిన విధానం సూపర్బ్ అంటూ ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇక ఈ టాక్ షోలో బాలయ్య ఎనర్జీకి అభిమానులు ఫిదా అయ్యారు. అయితే తాజాగా ఈ టాక్ షో రెండో సీజన్‌కు సంబంధించిన తొలి ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Unstoppable 2 Promo: తండ్రీకొడుకులు కలిసి నా సంసారంలో నిప్పులు పోస్తున్నారు అంటోన్న బాలయ్య!

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు లోకేశ్ కూడా బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్‌కు గెస్టులుగా వస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నారా చంద్రబాబు నాయుడిని బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే బాలయ్య తన బావగారు, తెలుగు ప్రేక్షకుల బాబుగారుని పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగినట్లుగా ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది. అటు అల్లుడు నారా లోకేశ్‌ను కూడా బాలయ్య ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది.

UnStoppable Trailer : ఈ సారి మరింత రంజుగా.. అన్ స్టాపబుల్ సీజన్ 2 ట్రైలర్ రిలీజ్..

ఏదేమైనా అన్‌స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్‌పై అప్పుడే అంచనాలు క్రియేట్ కావడంతో, అందరూ ఈ ఎపిసోడ్ కోసం ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ టాక్ షో గురించి అభిమానులతో పాటు యావత్ టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో చర్చించుకుంటున్నారు. ఒకే వేదికపై బాలయ్య, చంద్రబాబు, నారా లోకేశ్‌లను చూడటం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. రాజకీయాలకు సంబంధించి బాలయ్య టాక్ షోలో ఎలాంటి చర్చ సాగుతుందో చూడాలి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.