Unstoppable : బాలయ్య క్రష్ ఎవరో తెలుసా.. హీరోయిన్ కి ఫోన్ చేసి ఫ్లర్ట్ చేసిన బాలయ్య..

అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండో ఎపిసోడ్ లో యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ వచ్చారు. ఈ షోలో సిద్ధు బాలయ్యబాబుని ఇప్పుడున్న హీరోయిన్స్ లో మీ క్రష్ ఎవరు అని అడగగా బాలకృష్ణ................

Unstoppable : బాలయ్య క్రష్ ఎవరో తెలుసా.. హీరోయిన్ కి ఫోన్ చేసి ఫ్లర్ట్ చేసిన బాలయ్య..

Balayya reveals his crush in Unstoppable

Unstoppable :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్ షో సీజన్ 2ని ఇటీవల గ్రాండ్ గా లాంచ్ చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో సీజన్ 2 మొదటి ఎపిసోడ్ సరికొత్త రికార్డుని సృష్టించింది. ఇక అప్పుడే సెకండ్ ఎపిసోడ్ ప్రోమోని కూడా రిలీజ్ చేసేశారు ఆహా టీం.

అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండో ఎపిసోడ్ లో యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ వచ్చారు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ హీరోలు రావడంతో ఈ ఎపిసోడ్ పై ఇప్పట్నుంచే అంచనాలు పెరిగాయి. ప్రోమో చూశాక ఎపిసోడ్ ఆద్యంతం ఫుల్ ఫన్ తో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ కి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా వచ్చారు. యువ హీరోలతో కలిసి బాలయ్య బాబు రచ్చ చేశారు. వాళ్ళతో కలిసి సరదాగా మాట్లాడుతూ సెటైర్స్ వేస్తూ ఎంటర్టైన్ చేశారు.

ఈ షోలో సిద్ధు బాలయ్యబాబుని ఇప్పుడున్న హీరోయిన్స్ లో మీ క్రష్ ఎవరు అని అడగగా బాలకృష్ణ.. రష్మిక మందన్నా అని చెప్పారు. దీంతో ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక ఫ్యాన్స్ ఈ కామెంట్ ని మరింత వైరల్ చేస్తున్నారు. అలాగే ఓ హీరోయిన్ కి ఫోన్ చేసి కాసేపు ఫ్లర్ట్ చేశారు బాలయ్య. అయితే అది డీజే టిల్లు హీరోయిన్ నేహాశెట్టి అయి ఉంటుందని భావిస్తున్నారు ప్రేక్షకులు.

Balayya – Pawan Kalyan : అన్‌స్టాపబుల్ షోకి పవర్ స్టార్, త్రివిక్రమ్.. హింట్ ఇచ్చిన బాలయ్య

ఆ హీరోయిన్ కి ఫోన్ చేసి బాలయ్య మాట్లాడుతూ.. మీ వాయిస్ విని మీ ఫేస్ చందమామలా ఉంటదని నేను చెప్పగలను. నేనేమో చీకట్లో ఉంటాను. ఇద్దరం కలిస్తే పున్నమి రాత్రే అని అన్నారు. సిద్ధు పక్కన కూర్చొని వింటుంటే నువ్వు ఇక్కడ్నుంచి వెళ్ళు నేను ఫోన్ మాట్లాడుకోవాలి అని సరదాగా అన్నారు. దీంతో బాలయ్య లోని ఈ అల్లరి కోణాన్ని కూడా షోలో బయట పెట్టారు. మరి ఆ ఫోన్ లో మాట్లాడింది నేహా శెట్టితోనేనా లేక ఇంకెవరితోనా చూడాలి అంటే ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అన్‌స్టాపబుల్ రెండో ఎపిసోడ్ అక్టోబర్ 21న ఆహాలో స్ట్రీమ్ అవ్వనుంది.