Balayya – Pawan Kalyan : అన్‌స్టాపబుల్ షోకి పవర్ స్టార్, త్రివిక్రమ్.. హింట్ ఇచ్చిన బాలయ్య

నాగవంశీతో మాట్లాడుతూ త్రివిక్రమ్ మీ బ్యానర్ లో తప్ప బయట సినిమాలు చేయడా అని అడిగితే ఆయన బయటికెళ్ళడం మాకిష్టం లేదు అని అన్నారు. వెంటన్ త్రివిక్రమ్ కి బాలకృష్ణ ఫోన్ చేసి అన్‌స్టాపబుల్ కి ఎప్పుడొస్తున్నావు అని అడిగారు. త్రివిక్రమ్.............

Balayya – Pawan Kalyan : అన్‌స్టాపబుల్ షోకి  పవర్ స్టార్, త్రివిక్రమ్.. హింట్ ఇచ్చిన బాలయ్య

pawan kalyan will come soon to balakrishna unstoppable

Updated On : October 16, 2022 / 12:18 PM IST

Balayya – Pawan Kalyan :  బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో చేసిన అన్‌స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. అదే ఊపులో సీజన్ 2ని కూడా గ్రాండ్ గా లాంచ్ చేసి ఇటీవలే మొదటి ఎపిసోడ్ రిలీజ్ చేశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో సీజన్ 2 మొదటి ఎపిసోడ్ సరికొత్త రికార్డుని సృష్టించింది.

ఇక అప్పుడే సెకండ్ ఎపిసోడ్ ప్రోమోని కూడా రిలీజ్ చేసేశారు ఆహా. అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండో ఎపిసోడ్ లో యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ వచ్చారు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ హీరోలు రావడంతో ఈ ఎపిసోడ్ పై ఇప్పట్నుంచే అంచనాలు పెరిగాయి. ప్రోమో చూశాక ఎపిసోడ్ ఆద్యంతం ఫుల్ ఫన్ తో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ఎపిసోడ్ కి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా వచ్చారు.

Unstoppable Episode 2 : అన్‌స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో.. సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ తో కలిసి రచ్చ చేసిన బాలయ్య

నాగవంశీతో మాట్లాడుతూ త్రివిక్రమ్ మీ బ్యానర్ లో తప్ప బయట సినిమాలు చేయడా అని అడిగితే ఆయన బయటికెళ్ళడం మాకిష్టం లేదు అని అన్నారు. వెంటన్ త్రివిక్రమ్ కి బాలకృష్ణ ఫోన్ చేసి అన్‌స్టాపబుల్ కి ఎప్పుడొస్తున్నావు అని అడిగారు. త్రివిక్రమ్ మీరెప్పుడంటే అప్పుడు వస్తాను అని చెప్పారు. దీంతో బాలయ్య ఎవరితో రావాలో తెలుసు కదా అని హింట్ ఇచ్చారు. ఇక బ్యాక్ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ సినిమా మ్యూజిక్ ప్లే అవ్వడంతో త్వరలో అన్‌స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి వస్తారని అంతా భావిస్తున్నారు.

వీరిద్దరూ మంచి స్నేహితులని అందరికి తెలిసిందే. బాలయ్య కూడా ఎవరితో రావాలో తెలుసు కదా అని అడగటంతో పవన్ అభిమానులు కచ్చితంగా పవన్ ఈ షోకి వస్తారని అంటున్నారు. పవన్-బాలయ్య ఒకే స్టేజి మీద కనిపిస్తే ఆ కిక్కే వేరు. ఈ ఎపిసోడ్ కోసం తెలుగు ప్రేక్షకులంతా ఎదురు చూస్తారు. మరి నిజంగానే పవన్ అన్‌స్టాపబుల్ కి వస్తాడా రాడా చూడాలి.