Unstoppable Episode 2 : అన్‌స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో.. సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ తో కలిసి రచ్చ చేసిన బాలయ్య

అప్పుడే సెకండ్ ఎపిసోడ్ ప్రోమో కూడా రిలీజ్ చేసేశారు ఆహా. అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండో ఎపిసోడ్ లో యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ వచ్చారు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ హీరోలు రావడంతో ఈ ఎపిసోడ్ పై........

Unstoppable Episode 2 : అన్‌స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్ ప్రోమో.. సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ తో కలిసి రచ్చ చేసిన బాలయ్య

Unstoppable Episode 2 promo released

Unstoppable Episode 2 : బాలయ్య బాబు ఆహాలో మొదలుపెట్టిన అన్‌స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. అదే ఊపులో సీజన్ 2ని కూడా గ్రాండ్ గా లాంచ్ చేశారు. గతంలో కంటే మరిన్ని అంచనాలు ఈ సీజన్ పై ఉండటంతో అభిమానులు, ప్రేక్షకులు ఈ సీజన్ కోసం ఆతృతగా ఎదురు చూశారు. అన్‌స్టాపబుల్ సీజన్ 2లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దీంతో సీజన్ 2 మొదటి ఎపిసోడ్ సరికొత్త రికార్డుని సృష్టించింది.

ఇక అప్పుడే సెకండ్ ఎపిసోడ్ ప్రోమో కూడా రిలీజ్ చేసేశారు ఆహా. అన్‌స్టాపబుల్ సీజన్ 2 రెండో ఎపిసోడ్ లో యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్ వచ్చారు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ హీరోలు రావడంతో ఈ ఎపిసోడ్ పై ఇప్పట్నుంచే అంచనాలు పెరిగాయి. షోలో ఎంట్రీ ఇవ్వగానే ఈ హీరోలతో కలిసి బాలయ్య డీజేటిల్లు స్టెప్ వేశారు. సిద్దు హెయిర్ స్టైల్ మీద బాలయ్య సరదాగా కౌంటర్ వేశారు.  ఎపిసోడ్ అంతా ఫుల్ సరదాగా సాగింది. బాలయ్య యువ హీరోలకి కౌంటర్లు వేశారు.

Tamil Movies : తమిళ సినిమాకి ఏమైంది..

ఫుల్ ఫన్ తో ఈ ఎపిసోడ్ సాగినట్టు తెలుస్తుంది. అలాగే ఈ ఎపిసోడ్ కి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా వచ్చారు. ఎపిసోడ్ లో బాలయ్య ఓ హీరోయిన్ కి ఫోన్ చేసి ఆటపట్టించారు. త్రివిక్రమ్ కి కూడా కాల్ చేసి మాట్లాడారు. ఎపిసోడ్ ప్రోమో ఆద్యంతం ఫుల్ ఫన్ గా సాగడంతో ప్రేక్షకులు, అభిమానులు ఈ ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫుల్ ఎపిసోడ్ అక్టోబర్ 21న ఆహాలో రిలీజ్ కానుంది.