Tamil Movies : తమిళ సినిమాకి ఏమైంది..

2022 కోలీవుడ్ సినిమాల పరిస్థితి టాలీవుడ్ తో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ రేంజ్ లో లేదని చెప్పాలి. ఈ ఏడాది పెద్ద సినిమాల సక్సెస్ రేట్ తక్కువే. కొన్ని చిన్న సినిమాలు మాత్రం పర్వాలేదనిపించాయి. ఒకప్పుడు ఇండియా మొత్తానికి సినిమాల విషయంలో............

Tamil Movies : తమిళ సినిమాకి ఏమైంది..

Tamil Movies results

Tamil Movies :  2022 కోలీవుడ్ సినిమాల పరిస్థితి టాలీవుడ్ తో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ రేంజ్ లో లేదని చెప్పాలి. ఈ ఏడాది పెద్ద సినిమాల సక్సెస్ రేట్ తక్కువే. కొన్ని చిన్న సినిమాలు మాత్రం పర్వాలేదనిపించాయి. ఒకప్పుడు ఇండియా మొత్తానికి సినిమాల విషయంలో ఆదర్శంగా నిలిచేది కోలీవుడ్ ఇండస్ట్రీ. అక్కడి సినిమాల క్వాలిటీ, వైవిధ్యం, భారీతనం, రీచ్ అంతా కూడా వేరే లెవెల్లో ఉండేది. వాళ్ల సినిమాలతో పోల్చుకుని మనం ఇన్ఫీరియర్‌గా ఫీలయ్యేవాళ్లం. తమిళ ఫిలిం మేకర్స్ ఘనతను కొనియాడేవాళ్లం. కానీ గత దశాబ్ద కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

తెలుగు సినిమాల క్వాలిటీ పెరిగింది. వాటి రీచ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక వాటి కమర్షియల్ సక్సెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అదే సమయంలో తమిళ సినిమాల క్వాలిటీ బాగా పడిపోయి, వాటికి తమిళనాడు అవతల ఆదరణ కరవవుతోంది. ‘బాహుబలి’కి పోటీగా అని చెప్పి కొన్ని ప్రయత్నాలేవో చేశారు కానీ వాటి వల్ల ఎలాంటి ఫలితం దక్కలేదు. ఈ ఏడాది బాలీవుడ్ లో సరైన రేంజ్లో సక్సెసులు దక్కనట్టు, కోలీవుడ్ లో కూడా మనకన్నా సక్సెస్ రేట్ తక్కువగా ఉంది.

2022 తమిళ ఇండస్ట్రీలో ‘విక్రమ్’ లాంటి బ్లాక్ బస్టర్ ఒకటే నమోదయింది. మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ తమిళ్ లో హిట్ అయినా బయటి పరిశ్రమలలో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. శింబు హీరోగా నటించిన ‘మానాడు’ సినిమా అదరగొట్టేసింది. ఎప్పటి నుంచో హిట్స్ లేని శింబుకి ఈ సినిమా ఎంతో రిలీఫ్ ఇచ్చింది. ఈ మూడు సినిమాలు తప్ప భారీ హిట్స్ ఏవి తమిళ్ లో నమోదవ్వలేదు.

దళపతి విజయ్ ‘బీస్ట్’ మూవీ కోలీవుడ్ లోనూ డిజాస్టర్ అవగా, అజిత్ నటించిన ‘వలిమై’ కూడా ఆశించిన రీతిలో అభిమానుల్ని అలరించలేకపోయింది. అలాగే విశాల్ ‘వీరమే వాగై సూడుమ్’, సూర్య ‘ఎదర్కుమ్ తనిందవన్’ లాంటి సినిమాలు ఆశించిన రీతిలో మెప్పించలేకపోయాయి. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నాత్తే’ మూవీ తమిళ్ లో యావరేజ్ గా నిలిచి మిగిలిన పరిశ్రమలలో డిజాస్టర్ గా నిలిచింది.

సి సుందర్ ‘అరణ్మనై 3’ హారర్ మూవీ, శివకార్తికేయన్ డాన్, విజయ్ సేతుపతి, సమంత, నయనతార ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ మూవీస్ తమిళనాడులో మాత్రం యావరేజ్ గా నిలిచాయి. అరుణ్ విజయ్ ‘యానై’, పార్తీబన్ ప్రయోగాత్మక చిత్రం ‘ఇరవిన్ నిళల్’ అక్కడ కూడా ఆకట్టుకోలేకపోయాయి. ధనుష్ ‘తిరుచిత్రాంబళం’ సైలెంట్ హిట్ గా నిలిచింది. ఇది ఓటీటీలో రిలీజ్ అయ్యాక వేరే భాషల్లో కూడా మంచి పేరు సంపాదించింది. ఇక కార్తి విరుమన్ తమిళ్ లో మాత్రమే హిట్ గా నిలిచింది.

Unstoppable episode 2 : అన్‌స్టాపబుల్ రెండో ఎపిసోడ్ గెస్టులు ఎవరో తెలుసా??

ఇక్కడ చెప్పుకోదగ్గ మరో విశేషమేంటంటే తమిళ నాట ఈ ఏడాది కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద బాగా రీసౌండ్ ఇచ్చిన సినిమాల్లో ఎక్కువగా డబ్బింగ్ అయిన సినిమాలే ఉన్నాయి. అందులోనూ తెలుగు, కన్నడ, హిందీ నుంచి వచ్చిన సినిమాలు కలెక్షన్ల మోత మోగించాయి. వాటిలో బాలయ్య ‘అఖండ’ సూపర్ హిట్ గా నిలవగా, పుష్ప, శ్యామ్ సింగరాయ్, కేజీఎఫ్ 2, బంగార్రాజు, ఆర్.ఆర్.ఆర్, విక్రాంత్ రోణా, సీతారామం, బ్రహ్మాస్త్ర లాంటి సినిమాలు అక్కడ కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ ను షేక్ చేశాయి.

మొత్తం మీద కోలీవుడ్ ఈ ఏడాది కోలీవుడ్ లో లోకల్ చిత్రాలకు ఆదరణ చాలా తక్కువ దక్కగా, డబ్బింగ్ మూవీస్ కు హైరేంజ్ లో అప్లాజ్ లభించింది. సో 2022 సినిమాల విషయంలో బాలీవుడ్ తో సహా కోలీవుడ్ లోనూ సినిమాల పరంగా టాలీవుడ్ ఆధిపత్యం తప్పలేదు. మరి ఈ మూడు నెలల్లో అయినా కోలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సినిమాలు వస్తాయేమో చూడాలి.