Bellamkonda Ganesh: బెల్లంకొండ గణేష్ రెండో సినిమా పోస్టర్ లాంచ్.. కథానాయికగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూతురు!

బెల్లంకొండ గణేష్ మొదటి సినిమా స్వాతిముత్యం దసరాకి విడుదలై, బాక్స్ ఆఫీస్ వద్ద కుటుంబ కథా చిత్రంగా విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్ లోనే తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రేక్షకులకు చేరువయ్యేలా చూస్తున్నాడు ఈ యువహీరో. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ పరిచయం చేస్తూ మూవీ టీం ఒక పోస్టర్ ను నేడు రిలీజ్ చేసింది.

Bellamkonda Ganesh: బెల్లంకొండ గణేష్ రెండో సినిమా పోస్టర్ లాంచ్.. కథానాయికగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూతురు!

Bellamkonda Ganesh Second Movie Poster Launch

Bellamkonda Ganesh: బెల్లంకొండ గణేష్ మొదటి సినిమా స్వాతిముత్యం దసరాకి విడుదలై, బాక్స్ ఆఫీస్ వద్ద కుటుంబ కథా చిత్రంగా విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్ లోనే తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రేక్షకులకు చేరువయ్యేలా చూస్తున్నాడు ఈ యువహీరో. ఈ నేపథ్యంలో ఆ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ పరిచయం చేస్తూ మూవీ టీం ఒక పోస్టర్ ను నేడు రిలీజ్ చేసింది.

Bellamkonda Ganesh : ఆ ఇద్దరు స్టార్ హీరోలని ఢీ కొడతా అంటున్న బెల్లంకొండ డెబ్యూ హీరో

“నేను స్టూడెంట్ సార్” అనే టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా.. షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. కాగా ఈ సినిమాలో అలనాటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని కథానాయికగా పరిచయం కాబోతుంది. సినిమాలోని ఆమె పాత్ర పేరు “శృతి వాసుదేవన్”ని పరిచయం చేస్తూ మూవీ మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు.

థ్రిల్లర్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు కృష్ణ చైతన్య కథని అందించగా, రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. “నాంది” వంటి వైవిధ్యమైన కథను తెరకెక్కించిన సతీష్ వర్మ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.

Image