Bellamkonda Sreenivas : బెల్లం బాబు.. బాలీవుడ్ తర్వాత హాలీవుడ్.. ‘సుఖీభవ.. సుఖీభవ’..

బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న ‘సుఖీభవ’ మీమ్స్..

Bellamkonda Sreenivas : బెల్లం బాబు.. బాలీవుడ్ తర్వాత హాలీవుడ్.. ‘సుఖీభవ.. సుఖీభవ’..

Bellamkonda Sreenivas

Updated On : September 28, 2021 / 3:32 PM IST

Bellamkonda Sreenivas: ఈరోజుల్లో సోషల్ మీడియా అనేది మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. పొద్దున్న లేచిన దగ్గరి నుంచి ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లతోనే పని.. ఇక నెట్టింట్లో చక్కర్లు కొట్టే మీమ్స్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.

MAA Elections 2021 : పవన్ కళ్యాణ్ కామెంట్స్‌తో నేను ఏకీభవించట్లేదు..

సందర్భానికి తగ్గట్లు మీమ్స్ రాయుళ్లు క్రియేట్ చేసే మీమ్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. గతకొద్ది రోజులుగా వైరల్ అవుతున్న మీమ్ ‘సుఖీభవ’.. ఈ మీమ్‌ను టాలీవుడ్ యంగ్ హీరో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి అన్వయిస్తూ మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. బెల్లంకొండ ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

Chatrapathi Remake

అతని బాలీవుడ్ ఎంట్రీ టాపిక్ తీసుకుని.. ‘అయ్యయ్యో.. టాలీవుడ్ చాలమ్మా.. బాలీవుడ్‌కి వెళ్తున్నాను.. టాలీవుడ్‌లో మా తమ్ముడు స్వాతిముత్యాన్ని పెట్టాను.. నెక్స్ట్ హాలీవుడ్.. సుఖీభవ.. సుఖీభవ’.. అంటూ మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి. బెల్లంకొండ తమ్ముడు గణేష్ బాబు ‘స్వాతిముత్యం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.