BiggBoss 6 : ఇక మొదలెడదామా.. ఈ సారి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ వీళ్ళే.. ఏకంగా 21 మంది..

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌ కొత్త సీజన్ గ్రాండ్ గా ప్రారంభం అయింది. బిగ్‌బాస్‌ 6వ సీజన్ కూడా నాగార్జుననే హోస్ట్ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు బిగ్‌బాస్‌ టెలికాస్ట్ మొదలయింది. ఓపెనింగ్ ఎపిసోడ్ చాలా గ్రాండ్ గా చేశారు.

BiggBoss 6 : ఇక మొదలెడదామా.. ఈ సారి బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ వీళ్ళే.. ఏకంగా 21 మంది..

BiggBoss 6 Contestants list

BiggBoss 6 :  తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌ కొత్త సీజన్ గ్రాండ్ గా ప్రారంభం అయింది. బిగ్‌బాస్‌ 6వ సీజన్ కూడా నాగార్జుననే హోస్ట్ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు బిగ్‌బాస్‌ టెలికాస్ట్ మొదలయింది. ఓపెనింగ్ ఎపిసోడ్ చాలా గ్రాండ్ గా చేశారు.

నాగార్జున ఓ ఎమోషనల్ పంచ్ డైలాగ్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బంగార్రాజు టైటిల్‌ సాంగ్‌కి మోడల్స్‌తో కలిసి స్టెప్పులేశారు నాగార్జున. మనకి రుచులు ఆరు, రుతువులు ఆరు, ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌ కూడా ఆరు అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్‌ బిగ్‌బాస్‌ 6 అని షో గురించి చెప్పుకొచ్చాడు నాగార్జున. ఆ తర్వాత తనే హౌస్‌లోకి వెళ్లి హౌస్ మొత్తాన్ని చూపించారు. ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో కంటే కూడా మరింత రిచ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. హౌస్ లో అన్ని ప్లేసులని పరిచయం చేశాడు. ఇక ఆ తర్వాత కంటెస్టెంట్స్ లని స్టేజి మీదకి పిలిచాడు.

#మొదటి కంటెస్టెంట్ గా కార్తీక దీపం సీరియల్ ఫేమ్ కీర్తి భట్ వచ్చింది.
#ఆ తర్వాత నువ్వు నాకు నచ్చవు సినిమాలో పింకీగా చేసిన ఆర్టిస్ట్ సుదీప ఎంట్రీ ఇచ్చింది.
#ఇక మూడో కంటెస్టెంట్ గా యూట్యూబ్, సీరియల్స్ తో ఫేమస్ అయిన సిరి హనుమంత్ బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ ఎంట్రీ ఇచ్చాడు. సిరి గతంలోబిగ్‌బాస్‌ సీజన్ 5 లో పాల్గొంది. ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ పాల్గొంటున్నాడు. శ్రీహాన్ కూడా పలు యూట్యూబ్ వెబ్ సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్నాడు.
#నాలుగో కంటెస్టెంట్ గా యాంకర్ నేహా చౌదరి ఎంట్రీ ఇచ్చింది. నేషనల్ జిమ్నాస్టిక్ ఛాంపియన్ గానే కాక, ఐపీఎల్ యాంకర్ గా కూడా పేరు తెచ్చుకుంది నేహా.
#ఇక ఐదో కంటెస్టెంట్ గా అందరికి సుపరిచితుడు అయిన జబర్దస్త్ చంటి వచ్చాడు.
#ఆరో కంటెస్టెంట్ గా ముద్దమందారం , త్రినయని, నిన్నే పెళ్ళాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెల్లు లాంటి పలు సీరియల్స్, యూట్యూబ్ సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్న శ్రీసత్య వచ్చింది.
#ఏడో కంటెస్టెంట్ గా పలు సినిమాల్లో ఆర్టిస్ట్ గా, వెబ్ సిరీస్ లాల్తో ఫేమ్ తెచ్చుకున్న అర్జున్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. #ఎనిమిదో కంటెస్టెంట్ గా యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న గలాటా గీతూ వచ్చింది.
#తొమ్మిదో కంటెస్టెంట్ గా ఒకప్పుడు అ అంటే అమలాపురం..ఆ అంటే ఆహా పురం అంటూ డ్యాన్స్ తో ఊపేసిన నటి, డ్యాన్సర్ అభినయశ్రీ వచ్చింది.
#10,11 కంటెస్టెంట్స్ గా రియల్ కపుల్, సీరియల్ ఆర్టిస్టులు రోహిత్,మరీనాలు ఎంట్రీ ఇచ్చారు.
#12వ కంటెస్టెంట్ గా చంటిగాడు లాంటి పలు సినిమాలతో మెప్పించిన హీరో బాలాదిత్య ఎంట్రీ ఇచ్చాడు.
#13వ కంటెస్టెంట్ గా పలు సినిమాలు, సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న వాసంతి కృష్ణ ఎంట్రీ ఇచ్చింది.
#14వ కంటెస్టెంట్ గా ఆర్టిస్ట్ షాని ఎంట్రీ ఇచ్చాడు.
#15వ కంటెస్టెంట్ గా నటి, ఆర్జీవీ హీరోయిన్ ఇనయా సుల్తానా ఎంట్రీ ఇచ్చింది.
#16వ కంటెస్టెంట్ గా నటుడు, ఆర్జే సూర్య ఎంట్రీ ఇచ్చాడు.
#17వ కంటెస్టెంట్ గా జబర్దస్త్ తో బాగా పాపులర్ అయిన ఫైమా ఎంట్రీ ఇచ్చింది.
#18వ కంటెస్టెంట్ గా బిగ్‌బాస్‌ రివ్యూలతో ఫేమస్ అయిన ఆదిరెడ్డి ఎంట్రీ ఇచ్చాడు.
#19వ కంటెస్టెంట్ గా మోడల్, నటుడు రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చాడు.
#20వ కంటెస్టెంట్ గా ఇస్మార్ట్ న్యూస్ తో ఫేమ్ సంపాదించుకున్న ఆరోహి రావు ఎంట్రీ ఇచ్చింది.
#ఇక చివరిగా 21వ కంటెస్టెంట్ గా అందరికి తెలిసిన ప్రముఖ సింగర్ రేవంత్ ఎంట్రీ ఇచ్చాడు.

BiggBoss 6 : టైటిల్ తీసుకొని బయటకి వస్తా.. ఎన్నో వదిలేసుకొని వెళ్తున్నా.. బిగ్‌బాస్ ఎంట్రీ లీక్ చేసేసిన సింగర్ రేవంత్

BiggBoss 6 Contestants list

BiggBoss 6 Contestants list

ఈ సారి 21 మందితో ఆట మొదలు పెట్టారు. ఇంతమంది ఒకే హౌస్ లో అంటే ఇంకెంత గందరగోళంగా, గొడవలతో ఉంటుందో చూడాలి. ఈ సారి ఎక్కువమంది ఫేమ్ ఉన్న వాళ్ళే ఉండటంతో ఈ సీజన్ పై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా మొదలుపెట్టారు. ఇక సీజ‌న్ 6 గ్రాండ్ లాంచింగ్ కి బాలీవుడ్ క‌పుల్ ఆలియాభ‌ట్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్ బ్రహ్మస్త్ర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విచ్చేసి సందడి చేశారు.