BiggBoss 6 : టైటిల్ తీసుకొని బయటకి వస్తా.. ఎన్నో వదిలేసుకొని వెళ్తున్నా.. బిగ్‌బాస్ ఎంట్రీ లీక్ చేసేసిన సింగర్ రేవంత్

సింగర్ రేవంత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ''నాకిష్టమైన మ్యూజిక్, నా ఫ్యామిలీ, నా వైఫ్ అందర్నీ వదులుకొని వెళ్తున్నాను. కొన్ని రోజులు దూరంగా ఉండటం తప్పదు. బయటకి వచ్చేటప్పుడు మాత్రం టైటిల్ తోనే వస్తాను. మీ అందరికి............

BiggBoss 6 : టైటిల్ తీసుకొని బయటకి వస్తా.. ఎన్నో వదిలేసుకొని వెళ్తున్నా.. బిగ్‌బాస్ ఎంట్రీ లీక్ చేసేసిన సింగర్ రేవంత్

Singer Revanth wants to come out with the title of Bigg Boss

BiggBoss 6 :  బిగ్‌బాస్ షో తెలుగులో కూడా బాగా పాపులర్ అయింది. చాలా మంది ఈ షోతో పాపులారిటీ తెచ్చుకున్నారు. మరి కొంతమంది ఫామ్ లోకి వచ్చారు. బిగ్‌బాస్ షోకి చాలా మంది అభిమానులు ఉన్నారు. కొంతమంది కంటెస్టెంట్స్ ని ఒక హౌస్ లో ఉంచి వాళ్ళకి పలు రకాల టాస్క్ లు ఇచ్చి చివరి వరకు ఉన్నవారిని, ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని విన్నర్ గా ప్రకటిస్తారు. ఇందులో పాల్గొనేవాళ్ళకి ఫేమ్ తో పాటు డబ్బులు కూడా బాగానే వస్తాయి.

బిగ్‌బాస్‌ సీజన్ 6 టెలికాస్ట్ కి రెడీ అయింది. సెప్టెంబర్ 4 ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి బిగ్‌బాస్‌ మొదలవనుంది. గత మూడు సీజన్ల నుంచి నాగార్జుననే బిగ్‌బాస్‌ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సారి బిగ్‌బాస్‌ సీజన్‌ 6 కూడా నాగార్జుననే యాంకర్ గా చేయనున్నారు. అలాగే ఈ సారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులని కూడా ఈ షోలో తీసుకోనున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు. బయటకి కొన్ని పేర్లు వినిపిస్తున్నా షో మొదలయ్యేవరకు ఎవరెవరు ఉన్నారో కచ్చితంగా చెప్పడం కష్టమే. అయితే సింగర్ రేవంత్ తాను బిగ్‌బాస్ లోకి వెళ్తున్నట్టు ఇండైరెక్ట్ గా పోస్ట్ చేశాడు.

BiggBoss 6 : బిగ్‌బాస్‌ గ్లింప్స్.. కొత్త బిగ్‌బాస్‌ ఇంటిని చూశారా.. వెయిటింగ్ అంటున్న అభిమానులు..

సింగర్ రేవంత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ”నాకిష్టమైన మ్యూజిక్, నా ఫ్యామిలీ, నా వైఫ్ అందర్నీ వదులుకొని వెళ్తున్నాను. కొన్ని రోజులు దూరంగా ఉండటం తప్పదు. బయటకి వచ్చేటప్పుడు మాత్రం టైటిల్ తోనే వస్తాను. మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా ఇస్తాను. మీ అందరి ప్రేమ, సపోర్ట్ నాకు కావాలి” అని పోస్ట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. సింగర్ రేవంత్ కచ్చితంగా బిగ్‌బాస్ లోకి వెళ్తున్నాడని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఒక కంటెస్టెంట్ ముందే ఇలా పోస్ట్ చేయడం మొదటి సారి. దీంతో రెండు రోజులు ముందే బిగ్‌బాస్ సందడి మొదలైంది.