BiggBoss 6 : బిగ్‌బాస్‌ గ్లింప్స్.. కొత్త బిగ్‌బాస్‌ ఇంటిని చూశారా.. వెయిటింగ్ అంటున్న అభిమానులు..

ఇటీవలే బిగ్‌బాస్‌ సీజన్ 6 టెలికాస్ట్ ప్రారంభ తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 4 ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి బిగ్‌బాస్‌ మొదలవనుంది. గత మూడు సీజన్ల నుంచి నాగార్జుననే బిగ్‌బాస్‌ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సారి బిగ్‌బాస్‌ సీజన్‌ 6 కూడా నాగార్జుననే యాంకర్ గా చేయనున్నారు. అలాగే.................

BiggBoss 6 : బిగ్‌బాస్‌ గ్లింప్స్.. కొత్త బిగ్‌బాస్‌ ఇంటిని చూశారా.. వెయిటింగ్ అంటున్న అభిమానులు..

BiggBoss 6 glimps released show starts from this sunday

BiggBoss 6 :  తెలుగులో కూడా బాగా పాపులర్ అయిన రియాలిటీ షో బిగ్‌బాస్‌. చాలా మంది ఈ షోతో పాపులారిటీ తెచ్చుకున్నారు. మరి కొంతమంది ఫామ్ లోకి వచ్చారు. తెలుగులో ఈ షోకి చాలా మంది అభిమానులు ఉన్నారు. కొంతమంది కంటెస్టెంట్స్ ని ఒక హౌస్ లో ఉంచి వాళ్ళకి పలు రకాల టాస్క్ లు ఇచ్చి చివరి వరకు ఉన్నవారిని విన్నర్ గా ప్రకటిస్తారు. ఇందులో పాల్గొనేవాళ్ళకి ఫేమ్ తో పాటు డబ్బులు కూడా బాగానే వస్తాయి. ఈ సరి బిగ్‌బాస్‌ సీజన్ 6 టెలికాస్ట్ కి రెడీ అయింది.

ఇటీవలే బిగ్‌బాస్‌ సీజన్ 6 టెలికాస్ట్ ప్రారంభ తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 4 ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి బిగ్‌బాస్‌ మొదలవనుంది. గత మూడు సీజన్ల నుంచి నాగార్జుననే బిగ్‌బాస్‌ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సారి బిగ్‌బాస్‌ సీజన్‌ 6 కూడా నాగార్జుననే యాంకర్ గా చేయనున్నారు. అలాగే ఈ సారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులని కూడా ఈ షోలో తీసుకోనున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఫైనల్ అయ్యారు. బయటకి కొన్ని పేర్లు వినిపిస్తున్నా షో మొదలయ్యేవరకు ఎవరెవరు ఉన్నారో కచ్చితంగా చెప్పడం కష్టమే.

67th FilmFare Awards : దేశభక్తికే ఓటు వేసిన ఫిలింపేర్.. ఫిలింపేర్ అవార్డుల్లో సత్తా చాటిన షేర్షా, సర్దార్ ఉదమ్..

తాజాగా ఈ షో నుంచి మొదటి గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఇందులో కొత్త బిగ్‌బాస్‌ హౌస్ ని పాక్షికంగా చూపించారు. అలాగే లాంచింగ్ ఎపిసోడ్ కి చాలా పర్ఫార్మెన్సులు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. లాంచింగ్ గ్రాండ్ గా చేయనున్నారు. తాజగా బిగ్‌బాస్‌ హౌస్ ని చూపిస్తూ రిలీజ్ చేసిన అయి టీజర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. దీంతో బిగ్‌బాస్‌ అభిమానులు ఈ షో కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి బిగ్ బాస్ సీజన్ 6 లో యాంకర్ మంజూష, హీరోయిన్ ఆశా సైనీ, హీరో లక్ష్, ట్రాన్సజెండర్ తన్మయి, న్యూస్ యాంకర్ పద్మిని, ఆర్టిస్ట్ సంజన చౌదరి, యూట్యూబ్ ఆర్టిస్ట్ కుషిత, యాక్టర్ భరత్, సీరియల్ ఆక్టర్ కౌశిక్, హీరో సుమంత్ అశ్విన్, హీరోయిన్ ప్రీతీ అస్రానితో పాటు మరికొంతమంది ఉండనున్నట్లు పేర్లు వినిపిస్తున్నాయి.