67th FilmFare Awards : దేశభక్తికే ఓటు వేసిన ఫిలింపేర్.. ఫిలింపేర్ అవార్డుల్లో సత్తా చాటిన షేర్షా, సర్దార్ ఉదమ్..

ఫిలింఫేర్ అవార్డ్స్ తాజాగా తన 67వ అవార్డ్స్ కార్య‌క్ర‌మాన్ని మంగ‌ళ‌వారం రాత్రి ముంబైలో జరుపుకుంది. బాలీవుడ్ తారలంతా ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఈ సారి అవార్డుల్లో దేశభక్తికే చోటు దక్కింది. దేశభక్తిని చాటిచెప్పిన సర్దార్ ఉదమ్, షేర్షా సినిమాలు ఎక్కువ అవార్డులు దక్కించుకున్నాయి..........

67th FilmFare Awards : దేశభక్తికే ఓటు వేసిన ఫిలింపేర్.. ఫిలింపేర్ అవార్డుల్లో సత్తా చాటిన షేర్షా, సర్దార్ ఉదమ్..

67th filmfare awards

 

67th FilmFare Awards :  ప్ర‌తీ సంవత్సరం జ‌రిగే పాపులర్ సినీ అవార్డుల కార్యక్రమం ఫిలింఫేర్ అవార్డ్స్ తాజాగా తన 67వ అవార్డ్స్ కార్య‌క్ర‌మాన్ని మంగ‌ళ‌వారం రాత్రి ముంబైలో జరుపుకుంది. బాలీవుడ్ తారలంతా ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఈ సారి అవార్డుల్లో దేశభక్తికే చోటు దక్కింది. దేశభక్తిని చాటిచెప్పిన సర్దార్ ఉదమ్, షేర్షా సినిమాలు ఎక్కువ అవార్డులు దక్కించుకున్నాయి.

విక్కీ కౌశల్ ముఖ్యపాత్రలో నటించిన సర్దార్ ఉదమ్ సినిమా అత్యధికంగా 9 అవార్డులు దక్కించుకుంది. ఆ తర్వాత
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ నటించిన షేర్షా సినిమా 7 అవార్డులను సాధించింది. కృతి సనన్ ముఖ్యపాత్రలో నటించిన మిమీ సినిమా మూడు అవార్డులను సాధించింది.

 

67 వ ఫిలింఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా షేర్షా సినిమా నిలిచింది. ఉత్తమ దర్శకుడిగా షేర్షా సినిమాకు గాను విష్ణువర్ధన్ అందుకున్నారు. 83 సినిమాకి రణవీర్ సింగ్ ఉత్తమ నటుడు, మిమీ సినిమాకి కృతి సనన్ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. క్రిటిక్స్ ఛాయస్ లో విక్కీయ్ కౌశల్ సర్దార్ ఉదమ్ సినిమాకి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు.

Brahmaji : అంకుల్ అంటే కేసు వేస్తా.. అనసూయకి ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చిన బ్రహ్మాజీ..

67 వ ఫిలింఫేర్ అవార్డు విజేతలు:

ఉత్తమ నటుడు: రణవీర్ సింగ్ (83)
ఉత్తమ నటి: కృతి సనన్, (మిమీ)
ఉత్తమ దర్శకుడు : విష్ణువర్ధన్ (షేర్షా)
ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి (మిమీ)
ఉత్తమ సహాయ నటి: సాయి తంహంకర్ (మిమీ)
ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: సుభాష్ ఘాయ్

ఉత్తమ నటి (క్రిటిక్స్) : విద్యాబాలన్ (షెర్ని)
ఉత్తమ నటుడు(క్రిటిక్స్) : విక్కీ కౌశల్(సర్దార్ ఉదమ్)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) : షూజిత్ సిర్కార్ (సర్దార్ ఉదమ్)

ఉత్తమ సౌండ్ డిజైన్ : దీపాంకర్ పాదం (సర్దార్ ఉదమ్)
బెస్ట్ ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్ (షేర్షా)
బెస్ట్ యాక్షన్ : స్టీఫన్ రిక్టర్, సునీల్ రోడ్రిగ్జ్ (షేర్షా)
ఉత్తమ సాహిత్యం : కౌసర్ మునీర్ -లెహ్రా దో (83)
బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ : శంతను మోయిత్రా (సర్దార్ ఉదమ్)
ఉత్తమ నేపథ్య గాయకుడు (షేర్షా)
ఉత్తమ నేపథ్య గాయని (షేర్షా)
ఉత్తమ స్క్రీన్ ప్లే : శుభేందు భట్టాచార్య మరియు రితేష్ షా (సర్దార్ ఉదమ్)
ఉత్తమ కథ : అభిషేక్ కపూర్ – చండీగఢ్ కరే ఆషికి
బెస్ట్ డైలాగ్ : దిబాకర్ బెనర్జీ – సందీప్ ఔర్ పింకీ ఫరార్
బెస్ట్ డెబ్యూ యాక్టర్ : ఇహాన్ భట్ (99 సాంగ్స్)
ఉత్తమ డెబ్యూ యాక్ట్రెస్ : శార్వరీ వాఘ్ (బంటీ ఔర్ బబ్లీ 2)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : సీమా పహ్వా (రాంప్రసాద్ కి తెహ్ర్వి)
ఉత్తమ సంగీత ఆల్బమ్ : షేర్షా
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ : వీర కపూర్ అవును (షేర్షా)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : అవిక్ ముఖోపాధ్యాయ (సర్దార్ ఉదమ్)
ఉత్తమ కొరియోగ్రఫీ : విజయ్ గంగూలీ (ఆత్రింగి రే)
ఉత్తమ VFX : సర్దార్ ఉదమ్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : మాన్సీ ధ్రువ్ మెహతా.. డిమిత్రి మలిచ్ (సర్దార్ ఉదమ్)