BiggBoss 6 Day 13 : బిగ్‌బాస్ సీజన్ 6.. ట్విస్టుల మీద ట్విస్టులు.. ఈ సారి డబల్ నామినేషన్.. కంటెస్టెంట్స్ మీద ఫైర్ అయిన నాగ్..

బిగ్‌బాస్ సీజన్ 6లో ఈ సారి సెకండ్ వీకెండ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చారు నాగార్జున. ఈ సీజన్ సరికొత్తగా సాగుతోంది. మొదటివారం ఎలిమినేషన్ తీసేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు నాగార్జున. అయితే ఈ సారి సెకండ్ వీక్ లో మాత్రం............

BiggBoss 6 Day 13 : బిగ్‌బాస్ సీజన్ 6.. ట్విస్టుల మీద ట్విస్టులు.. ఈ సారి డబల్ నామినేషన్.. కంటెస్టెంట్స్ మీద ఫైర్ అయిన నాగ్..

BiggBoss 6 Day 13 performences shani eliminated

BiggBoss 6 Day 13 :  బిగ్‌బాస్ సీజన్ 6లో ఈ సారి సెకండ్ వీకెండ్ లో ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చారు నాగార్జున. ఈ సీజన్ సరికొత్తగా సాగుతోంది. మొదటివారం ఎలిమినేషన్ తీసేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు నాగార్జున. అయితే ఈ సారి సెకండ్ వీక్ లో మాత్రం డబల్ ఎలిమినేషన్ ఉంటుంది అని షాక్ ఇచ్చాడు. సరికొత్తగా శనివారం ఒకరు, ఆదివారం ఒకరు ఎలిమినేట్ అవుతారని ట్విస్ట్ ఇచ్చాడు.

మొదట కంటెస్టెంట్స్ తో మాట్లాడారు నాగార్జున. బాలాదిత్య, షాని, సుదీప, వాసంతి, శ్రీసత్య, మెరీనా -రోహిత్, అభినయశ్రీ, కీర్తి, శ్రీహన్.. వీరందరిని వెనకాల నించోమని సీరియస్ గా చెప్పారు నాగ్. వీళ్ళతో మాట్లాడుతూ.. ఈవారం ఆట ఏమాత్రం బాగాలేదని అన్నారు. ఇక మిగిలిన వాళ్లలో ఫైమా తను ఓడినా, పక్కనివాళ్ళు గెలవకూడదు అని ఆడుతుంది అది తప్పు అని సీరియస్ అయ్యారు. చంటి జోకులు బాగా వేస్తున్నాడు కానీ ఆట మాత్రం ఆడట్లేదు, సూర్య హౌస్ కి గేమ్ ఆడటానికి వచ్చినట్లు లేదు, చిల్ అవ్వడానికి వచ్చినట్లు ఉంది, రేవంత్ జడ్జిమెంట్ చేస్తున్నట్లు కాకుండా తన ఆటపై ఫోకస్ చేయాలని, కెప్టెన్ రాజ్ ని అందర్నీ అడుక్కొని కెప్టెన్ అయ్యావని ఫైర్ అయ్యారు. ఇక వెనకాల నిలబెట్టిన వాళ్లందరిపై ఫైర్ అవుతూ అసలు మీ గురించి చెప్పడానికి ఏమి లేదు. మీలో ఇద్దరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు అని వాళ్లకి షాక్ ఇచ్చారు నాగార్జున.

BiggBoss 6 Day 12 : రెండో వారం కెప్టెన్ ఎవరూ ఊహించని విధంగా.. హౌస్ లో సందడి చేసిన కృతిశెట్టి, సుధీర్ బాబు..

వెనకాల నిలబెట్టిన వాళ్లలో ఎవరు వేస్ట్ అని స్టాంప్ వేసి డిసైడ్ చేయాలి అని చెప్పగా అందరికంటే ఎక్కువగా షానికి 3 ఓట్లు, శ్రీసత్యకి 3, వాసంతికి 3 ఓట్లు వచ్చాయి. దీంతో వీరిలో ఇవాళ ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు అని నాగ్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. నాగ్ ఒక కార్డు తీసుకుని చూపించగా అందులో షాని పేరు ఉంటుంది. దీంతో షాని ఎలిమినేట్ అయినట్లు నాగ్ చెప్పడంతో హౌస్ మేట్స్ అంతా షానిని హౌస్ నుంచి బయటకు పంపారు. ఇక షాని వేదిక మీదకి వచ్చి బిగ్‌బాస్ లో అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్ అని, ఇక్కడ ప్రేక్షకులని అలరించడానికి ట్రై చేశానని, ఇప్పుడు బయట సినిమాలతో ఎంటర్టైన్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.

ఇక చివరగా ఒకేఒక జీవితం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అమల, హీరో శర్వానంద్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. కాసేపు ఇద్దరూ సరదాగా మాట్లాడారు. నాగార్జున అమల కోసం హలో గురు ప్రేమకోసమే సాంగ్ పాడి అలరించారు. ఇక చివర్లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ అని, రేపు ఆదివారం ఇంకో ఎలిమినేషన్ ఉంటుందని మరో ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. మరి నేటి ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.