BiggBoss 6 Day 16 : “దొంగ-పోలీస్” వేట.. హీటెక్కిన బిగ్‌‌బాస్‌ ఆట!

నాగార్జున ఇచ్చిన వార్నింగ్ ఎఫెక్ట్ అనుకుంటా.. బిగ్‌‌బాస్‌ హౌస్ లో ఒక్కసారిగా హీట్ ని పెంచేసింది. రెండువారాలు ప్రశాంతంగా సాగిని బిగ్‌‌బాస్‌, ఇప్పుడు ఒక్కసారిగా గొడవలతో రచ్చ లేపేసింది. బిగ్‌‌బాస్‌ మూడోవారం కెప్టెన్సీ టాస్క్ ఇవ్వగా కంటెస్టెంట్స్ మధ్య ఆజ్యం పోసినట్లు అయింది. "అడవిలో ఆట" అంటూ ఇచ్చిన టాస్క్ లో..

BiggBoss 6 Day 16 : “దొంగ-పోలీస్” వేట.. హీటెక్కిన బిగ్‌‌బాస్‌ ఆట!

BiggBoss 6 Day 16 Episode

BiggBoss 6 Day 16 : నాగార్జున ఇచ్చిన వార్నింగ్ ఎఫెక్ట్ అనుకుంటా.. బిగ్‌‌బాస్‌ హౌస్ లో ఒక్కసారిగా హీట్ ని పెంచేసింది. రెండువారాలు ప్రశాంతంగా సాగిని బిగ్‌‌బాస్‌, ఇప్పుడు ఒక్కసారిగా గొడవలతో రచ్చ లేపేసింది. మూడోవారం నామినేషన్స్ తో మొదలైన ఈ గొడవలు, మంగళవారం జరిగిన కెప్టెన్సీ పోటీదారుడు టాస్క్ తో మరింత గందరగోళానికి దారితీసింది.

BiggBoss 6 Day 16 : బిగ్‌‌బాస్‌ “దొంగ పోలీస్” ఆట.. హౌస్ లో హీట్ పుట్టిస్తున్న నేటి ప్రోమో!

సోమవారం నామినేషన్స్ ప్రక్రియ జరగడంతో.. మంగళవారం ఇంటి సభ్యుల మధ్య ఎప్పటిలాగానే చర్చలు జరిగాయి. నామినేషన్లు చాలా సిల్లీ రీజన్స్ తో చేసారంటూ గీతూ రాయల్, ఆదిరెడ్డి రివ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇనాయ చాలా తెలివిగా గేమ్ ఆడుతుందని, హైలైట్ అవ్వడానికి ట్రై చేస్తుందని గీతూ కామెంట్ చేయగా.. ఇనాయ అసలు అర్ధంపర్ధం లేకుండా మాట్లాడుతుందని ఆదిరెడ్డి వ్యాఖ్యానించాడు.

ఇక బిగ్‌‌బాస్‌ మూడోవారం కెప్టెన్సీ టాస్క్ ఇవ్వగా కంటెస్టెంట్స్ మధ్య ఆజ్యం పోసినట్లు అయింది. “అడవిలో ఆట” అంటూ ఇచ్చిన టాస్క్ లో.. దొంగలు అడవి నుంచి వస్తువులను దొంగలించి, వ్యాపారికి అమ్ముకుని సొమ్ము చేసుకోవాలి. ఈ దొంగలను ఆడుకుంటూ పోలీసులు వ్యవహరించాలి. దీంతో ఆదిరెడ్డి పోలీస్‌ హెడ్‌గా ఉండగా, చంటి, రాజశేఖర్, రోహిత్‌-మరీనా, శ్రీసత్య, ఫైమా, ఇనాయ, బాలాదిత్య పోలీసులుగా ఉండగా.. రేవంత్, సుదీప, కీర్తి, ఆరోహి, నేహా, ఆర్జే సూర్య, వసంతి, అర్జున్‌, శ్రీహాన్ లు దొంగలుగా, గీతూ రాయల్ వ్యాపారిగా వ్యవహిరించారు.

దొంగ-పోలీసులుగా విడిపోయిన కంటెస్టెంట్స్.. అడవిలో దొంగలిస్తూ దొంగలు, వారిని అడ్డుకుంటూ పోలీసులు ఆట మొదలుపెట్టేసారు. ఈ క్రమంలో ఇనాయకు, శ్రీహాన్ కు మధ్య గొడవ మొదలయ్యింది. ఇనాయ, శ్రీహాన్ ను ‘వాడు’ అని సంబోధించడంతో.. ఇద్దరి మధ్య మొదలైన గొడవలోకి రేవంత్ జోక్యం చేసుకోవడంతో పెద్ద దుమారం రేపింది. ఒక సమయంలో రేవంత్ మితిమీరి మాట్లాడాడు అనిపించింది. ఇక ఈ టాస్క్ లో ఆరోహి కాలుకి గాయమైంది. మరోపక్క వ్యాపారిగా వ్యవహరించిన గీతూ ఇవేవి పట్టించుకోకుండా తనదైన శైలిలో ఆటని ఆడింది.