BiggBoss 6 Day 17 : దొంగా పోలీస్ ఆట.. ఒకర్నొకరు తిట్టుకోవడమే సరిపోయింది..

బిగ్‌బాస్ సీజన్ 6 రోజు రోజుకి మరింత హీటెక్కుతోంది. సెకండ్ వీకెండ్ లో నాగార్జున కంటెస్టెంట్స్ ని సరిగ్గా ఆడట్లేదని తిట్టడంతో మూడవ వారం ఒక్కొక్కరు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఇక కంటెస్టెంట్స్ కి దొంగా పోలీస్ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్ లో ఒకర్నొకరు తిట్టుకుంటూ, ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ......................

BiggBoss 6 Day 17 : దొంగా పోలీస్ ఆట.. ఒకర్నొకరు తిట్టుకోవడమే సరిపోయింది..

BiggBoss 6 Day 17 contestants performance

BiggBoss 6 Day 17 :  బిగ్‌బాస్ సీజన్ 6 రోజు రోజుకి మరింత హీటెక్కుతోంది. సెకండ్ వీకెండ్ లో నాగార్జున కంటెస్టెంట్స్ ని సరిగ్గా ఆడట్లేదని తిట్టడంతో మూడవ వారం ఒక్కొక్కరు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఇక కంటెస్టెంట్స్ కి దొంగా పోలీస్ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్ లో ఒకర్నొకరు తిట్టుకుంటూ, ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఆడుతున్నారు.

ఎప్పటిలాగే గీతూ, రేవంత్ తమ నోటికి పని చెప్పి ఎదుటి వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. గీతూ జోలికి ఎవరు వచ్చినా తిట్టేస్తుంది. దొరికిన వాళ్ళ వస్తువులన్నిటిని గీతూ దొంగిలించడం మొదలుపెట్టింది. తాను దొంగిలించినవాటిని ఓ సూట్ కేసులో దాచుకుంది. ఇక రేవంత్ వస్తువులు పోవడంతో రేవంత్ అందరిమీద ఫైర్ అయ్యాడు. దొంగలించినవాళ్ళకి సిగ్గుండాలి అంటూ గట్టిగానే తిట్టాడు. నేను కూడా ఎవర్ని వదిలిపెట్టను అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

Ori Devuda: ఓరి దేవుడా.. సర్‌ప్రైజ్ మామూలుగా లేదుగా..!

పింకీ, రేవంత్ మధ్య కూడా గొడవ జరుగుతుంది. నీ బొమ్మలు పోయాయని చెప్పి టీం మొత్తాన్ని రిస్క్ లో పెట్టడం కరెక్ట్ కాదు అని పింకీ రేవంత్ తో గొడవ పెట్టుకుంది. రేవంత్ గోడ ఎక్కి పైన ఉన్న వస్తువులని తీసుకునేందుకు ట్రై చేస్తుంటే బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడంతో దిగిపోతాడు. ఇదే టాస్క్ లో మరో రౌండ్ మొదలవుతుంది. ఇందులో ఇనయ, కీర్తి మధ్య గొడవ జరిగింది. ఫైమా తనని కొట్టింది అంటూ నేహా కంప్లైంట్ చేస్తుంది. దొంగల గ్యాంగ్ లో ఉన్న సూర్య పోలీస్ గా ఉన్న మెరీనాని కిడ్నాప్ చేయడంతో ఎపిసోడ్ ముగిసింది. మరి ఈ టాస్క్ లో దొంగల టీం లేదా పోలీస్ టీం ఎవరు గెలుస్తారో చూడాలి.