Ori Devuda: ఓరి దేవుడా.. సర్‌ప్రైజ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్‌లో మాస్ కా దాస్ అనే పేరును తెచ్చుకున్న యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. విశ్వక్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓరి దేవుడా..’ తమిళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘ఓ మై కాదవులే’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి చిత్ర యూనిట్ తాజాగా ఓ సర్‌ప్రైజ్ గ్లింప్స్ వదిలింది.

Ori Devuda: ఓరి దేవుడా.. సర్‌ప్రైజ్ మామూలుగా లేదుగా..!

Ori Devuda: టాలీవుడ్‌లో మాస్ కా దాస్ అనే పేరును తెచ్చుకున్న యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. విశ్వక్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓరి దేవుడా..’ తమిళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘ఓ మై కాదవులే’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మరిముత్తు తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి చిత్ర యూనిట్ తాజాగా ఓ సర్‌ప్రైజ్ గ్లింప్స్ వదిలింది.

Ori Devuda : ‘ఓరి దేవుడా’ అంటున్న విశ్వక్ సేన్

ఈ సినిమాలో లవ్ గాడ్‌గా ఓ స్పెషల్ పాత్రలో నటించబోతున్నాడు స్టార్ హీరో విక్టరీ వెంకటేష్. ఆయన పాత్రను ఇంట్రొడ్యూస్ చేస్తూ ఓ చిన్న గ్లింప్స్ వీడియోను తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సర్‌ప్రైజ్ గ్లింప్స్‌తో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నాడా… అంటూ అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఇక వెంకీ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా షాకింగ్ సర్‌ప్రైజ్ అని చెప్పాలి. ఇద్దరు ప్రేమికులు పెళ్లి తరువాత మనస్పర్థల కారణంగా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతారు. ఆ తరువాత వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ సినిమా కథగా ఉండబోతుంది.

Vishwak Sen: రిలీజ్ డేట్ కన్ఫం చేసుకున్న విశ్వక్ సేన్ మూవీ

ఇక విక్టరీ వెంకటేష్ చేస్తున్న పాత్రను తమిళంలో స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి పోషించిన తీరు అద్భుతం అని ఆయన అభిమానులు అంటున్నారు. మరి విశ్వక్ సేన్ కోసం సర్‌ప్రైజ్ ఇచ్చిన వెంకటేష్, ఈ సినిమాలో హీరోహీరోయిన్లు విడిపోకుండా ఏం చేస్తాడనేది మనకు సినిమా రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. కాగా ఈ సినిమాలో మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటిస్తోండగా, లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. పివిపి సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.