BiggBoss 6 Day 18 : ఈ వారం కెప్టెన్సీ పోటీలో ఉన్నది వీళ్ళే.. గొడవలతో పాటు కొన్ని జోకులు కూడా..

 బిగ్‌బాస్ మూడోవారంలో నిన్నటివరకు ఒక్కొక్కరు సీరియస్ అయి రెచ్చిపోయి మరీ ఆడారు. కంటెస్టెంట్స్ కి ఇచ్చిన దొంగ-పోలీస్ టాస్క్ ఈ ఎపిసోడ్ లో ముగిసింది. టాస్క్ లో పోలీస్ టీం గెలిచింది. ఈ టాస్క్ లో భాగంగా...............

BiggBoss 6 Day 18 : ఈ వారం కెప్టెన్సీ పోటీలో ఉన్నది వీళ్ళే.. గొడవలతో పాటు కొన్ని జోకులు కూడా..

BiggBoss 6 Day 18 performances captaincy war

BiggBoss 6 Day 18 :  బిగ్‌బాస్ మూడోవారంలో నిన్నటివరకు ఒక్కొక్కరు సీరియస్ అయి రెచ్చిపోయి మరీ ఆడారు. కంటెస్టెంట్స్ కి ఇచ్చిన దొంగ-పోలీస్ టాస్క్ ఈ ఎపిసోడ్ లో ముగిసింది. టాస్క్ లో పోలీస్ టీం గెలిచింది. ఈ టాస్క్ లో భాగంగా బంగారు కొబ్బరి బోండం సాధించడంతో శ్రీ సత్య నేరుగా కెప్టెన్సీ పోటీకి ఎంపికైంది. ఇక మిగిలిన కెప్టెన్సీ పోటీదారులని హౌస్ మేట్స్ ఎంచుకున్నారు. గీతూ, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఫైమా కూడా కెప్టెన్సీ పోటీకి సెలెక్ట్ అయ్యారు. దీంతో కెప్టెన్సీ టాస్క్ లో అయిదుగురు పోటీపడనున్నారు.

దొంగ-పోలీస్ టాస్క్ అవ్వగానే కెప్టెన్సీ పోటీదారులు ఫైనల్ అవ్వగానే కెప్టెన్సీ టాస్కులు కూడా మొదలుపెట్టేశాడు బిగ్‌బాస్. ఈ కెప్టెన్సీ పోటీలకు రేవంత్ ని సంచలకుడిగా సెలెక్ట్ చేశారు. అయితే ఫస్ట్ టాస్క్ లోనే గీతూ ఎలిమినేట్ అయింది. ఇక గేమ్ రూల్స్ పాటించలేదని ఫైమాను కూడా ఎలిమినేటి చేశాడు రేవంత్. ఈ విషయంలో ఫైమా రేవంత్ తో గట్టిగానే గొడవ పెట్టుకుంది. ఇనయా కూడా ఫైమాకి సపోర్ట్ చేసింది. అయినా రేవంత్ ఫైమాని కెప్టెన్సీ టాస్కుల నుంచి తప్పించాడు.

BiggBoss 6 Day 17 : దొంగా పోలీస్ ఆట.. ఒకర్నొకరు తిట్టుకోవడమే సరిపోయింది..

మధ్యలో ఇనయా వచ్చి శ్రీహాన్ కూడా తప్పు ఆడాడు అని కాసేపు హడావిడి చేసింది. వీరిద్దరిమధ్య కాసేపు గొడవ జరిగింది. దీంతో ఇనయా హౌస్ అంతా పరిగెడుతూ రచ్చరచ్చ చేసింది. మధ్యలో ఏం సంబంధం లేకపోయినా గీతూ వచ్చి ఇనయాని అడ్డుకుంటూ ఎప్పటిలాగే హడావిడి చేసింది. ఆదిరెడ్డి, శ్రీహన్, శ్రీసత్య లలో ఎవరు కెప్టెన్సీ అన్నది మరో టాస్క్ తో నేడు తెలుస్తుంది.

ఇక రేవంత్ మరోసారి అందరి మీద ఫైర్ అయ్యాడు. ఎవరో ఏదో అన్నారని అన్నం తినడం మానేసి చిన్నపిల్లాడిలా హడావిడి చేశాడు. కెప్టెన్ గా ఉన్న రాజ్ తను అస్సలు పెళ్ళి చేసుకోవద్దు అనుకున్నానని కాని హౌస్ లోకి వచ్చిన తరువాత ఇక్కడ ఉన్న మెరీనా రోహిత్ లని చూసి పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నానని చెప్పాడు. దీంతో హౌస్ లో ఉన్న అమ్మాయిల్లో ఎవరితో లింక్ అంటూ కాసేపు రాజ్ ని అందరూ ఆడుకున్నారు.