BiggBoss 6 Day 19 : కొత్త బిగ్‌బాస్ కెప్టెన్ ఎవరో తెలుసా.. మళ్ళీ గీతూ హడావిడి..

నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో కొత్త కెప్టెన్ ఎన్నికయ్యారు. కెప్టెన్సీ టాస్క్ లో చివరివరకు శ్రీ సత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి పోటీపడ్డారు. లాస్ట్ టాస్క్ కొంచెం ఈజీగానే ఇచ్చారు............

BiggBoss 6 Day 19 : కొత్త బిగ్‌బాస్ కెప్టెన్ ఎవరో తెలుసా.. మళ్ళీ గీతూ హడావిడి..

BiggBoss 6 Day 19 new captain in house

BiggBoss 6 Day 19 :  బిగ్‌బాస్ సీజన్ 6 ఎప్పటిలాగే గొడవలు, అరుపులు, ఏడుపులతో సాగుతుంది. మధ్యమధ్యలో కామెడీ కూడా బాగానే చేస్తున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో కొత్త కెప్టెన్ ఎన్నికయ్యారు. కెప్టెన్సీ టాస్క్ లో చివరివరకు శ్రీ సత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి పోటీపడ్డారు. లాస్ట్ టాస్క్ కొంచెం ఈజీగానే ఇచ్చారు. ‘ఎత్తర జెండా’ అనే ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో ఇసుకని కాడికి ఓ వైపు ఖాళీ బాక్స్ లో పోస్తే, మరోవైపు ఉన్న జెండా పైకి లెగుస్తుంది. ఎవరి జెండా ముందు పైకి లెగిస్తే వారే కెప్టెన్ అని చెప్పడంతో ముగ్గురూ బాగానే పోటీ పడ్డారు. కానీ ఆదిరెడ్డి ఈజీగా ఈ టాస్క్ గెలిచి హౌస్ లో కొత్త కెప్టెన్ గా ఎన్నికయ్యాడు.

ఇక కెప్టెన్సీ ఎన్నిక అనంతరం హౌస్ లో గంటసేపు ప్రసారమయ్యే షోలో ఎవరు ఎక్కువగా కనిపిస్తారని అనుకుంటున్నారని ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంట్లో ఎక్కువగా పదినిమిషాల పాటు తాను కనిపిస్తానని చెప్పి గీతూ ఈ టాస్క్ లో గెలిచింది. ఆ తర్వాత ఏడు నిమిషాలు కనిపిస్తానని రేవంత్‌ ఓ ట్యాగ్‌ గెలుగుచుకున్నాడు. కంటెస్టెంట్స్ అంతా ఒక్కొక్కరు బిగ్‌బాస్ ఇచ్చిన టైమింగ్స్ లో ఒక్కోటి సెలెక్ట్ చేసుకున్నారు.

BiggBoss 6 Day 18 : ఈ వారం కెప్టెన్సీ పోటీలో ఉన్నది వీళ్ళే.. గొడవలతో పాటు కొన్ని జోకులు కూడా..

చివర్లో జీరో టైమింగ్‌ కోసం కీర్తి, ఆరోహి, అర్జున్‌ పోటీ పడ్డారు. కీర్తి జీరో టైమింగ్ లో ఉందని తెలుసుకొని బాధపడింది. ఇక వీరి ముగ్గురిలో ఎవరో ఒకరు జైలుకెళ్లాలి అని చెప్పడంతో వీళ్ళే చర్చించుకొని అర్జున్ ని జైలుకి పంపించారు. ఈ టాస్క్ గురించి అందరూ చర్చించుకున్నారు. వచ్చే ఎపిసోడ్స్ నుంచి ఎక్కువ సేపు కనపడేలా ఆడాలి అని అనుకున్నారు.

ఆ తర్వాత కంటెస్టెంట్స్ మాట్లాడుకోవడాలు చూపించాడు. ఇక గీతూ పది నిముషాలు కనిపిస్తున్నానని హడావిడి చేసింది. మామూలుగానే గీతూ హడావిడి, ఓవర్ యాక్షన్ ఎవ్వరూ ఆపలేరు. ఇక ఎక్కువసేపు కనిపిస్తున్నాను అని తెలియడంతో రచ్చ రచ్చ చేసింది. ఆ తర్వాత ఆరోహి, ఆర్జే సూర్య ఫుడ్‌ కోసం దొంగతనం చేసి చాటుగా వంట చేసుకొని తిన్నారు. ఇలా నిన్నటి ఎపిసోడ్ లో మొదట కెప్టెన్సీ టాస్క్, టైమింగ్ టాస్క్ తో బాగానే నడిచినా చివర్లో చప్పగా సాగింది.