BiggBoss 6 Day 27 : హౌస్ కంటెస్టెంట్స్ కి టిప్పులిచ్చి మరీ క్లాస్ పీకిన నాగార్జున..

బిగ్‌‌బాస్‌ ఆరో సీజన్‌ చప్పగా సాగుతుందనే చెప్పొచ్చు. హౌస్ లో గొడవలు తప్ప, టాస్కులు కూడా అంత ఆసక్తికరంగా ఉండట్లేదు. వీకెండ్ ఎపిసోడ్ కి వచ్చిన నాగార్జున లాస్ట్ వీక్ లో లాగానే.............

BiggBoss 6 Day 27 :  హౌస్ కంటెస్టెంట్స్ కి టిప్పులిచ్చి మరీ క్లాస్ పీకిన నాగార్జున..

BiggBoss 6 Day 27 nagarjuna fires on Contestants

BiggBoss 6 Day 27 :  బిగ్‌‌బాస్‌ ఆరో సీజన్‌ చప్పగా సాగుతుందనే చెప్పొచ్చు. హౌస్ లో గొడవలు తప్ప, టాస్కులు కూడా అంత ఆసక్తికరంగా ఉండట్లేదు. వీకెండ్ ఎపిసోడ్ కి వచ్చిన నాగార్జున లాస్ట్ వీక్ లో లాగానే కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకాడు. గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున రాగానే ఈ వారం కెప్టెన్ అయిన కీర్తిని అభినందించారు.

ఆ తర్వాత కంటెస్టెంట్స్ కి ఒక్కొక్కరికి క్లాస్ పీకాడు నాగార్జున. సూర్య ఫుడ్‌ పడేయడంతో గట్టిగానే ఫైర్ అయ్యాడు నాగార్జున. ఆ తర్వాత కెప్టెన్‌గా ఆదిరెడ్డి విఫలమయ్యాడు అని క్లాస్ పీకాడు. ఆ తర్వాత ఆరోహి,సూర్యల మధ్య కెమిస్ట్రీ నడుస్తుందేంటి అని అడిగాడు. దీంతో ఆరోహికి, సూర్యకి లవర్స్ ఉన్నారు బయట అని చెప్పారు.

ఇక రేవంత్ ఆటని మరింత మెరుగుపర్చుకోవాలని వెయ్యి రూపాయల టిప్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఆ తర్వాత రేవంత్‌ భార్య సీమంతం వీడియోని చూపించడంతో రేవంత్ ఎమోషనల్ అయ్యాడు. ఈ టైంలో గీతూ మళ్ళీ ఓవరాక్షన్ చేయడంతో ఇంటి సభ్యులు కూడా గీతూని తట్టుకోలేకపోయారు. మిగిలిన వాళ్ళ తప్పొప్పుల గురించి కూడా చెప్పాడు నాగార్జున. కొంతమందికి టిప్పులిచ్చిన నాగార్జున ఆదిరెడ్డి, బాలాదిత్య, ఇనయ, చంటిలకు మాత్రం టిప్పు ఇవ్వలేదు.

Balakrishna: బాలయ్యతో చేయడం అంటే ఓ అద్భుతమంటోన్న డైరెక్టర్!

వీరిలో ఒకరికి ఈ సీజన్‌ మొత్తం కెప్టెన్‌ కాకుండా చేసే పనిష్‌మెంట్‌ ఇవ్వమనడంతో ఇంటి సభ్యులంతా కలిసి చంటిని డిసైడ్ చేయడంతో చంటి ఈ సీజన్ కెప్టెన్ అయ్యే అర్హత కోల్పోయాడు. చంటికి గట్టిగా క్లాస్‌ పీకి ఇకనైనా సరిగ్గా ఆడాలన్నాడు నాగార్జున. ఆ తర్వాత కంటెస్టెంట్స్ కి ఓ పానీపూరి గేమ్ పెట్టారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది నేటి ఎపిసోడ్ లో తెలుస్తుంది.