Balakrishna: బాలయ్యతో చేయడం అంటే ఓ అద్భుతమంటోన్న డైరెక్టర్!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బాలయ్య కెరీర్‌లో ఈ సినిమా 107వ చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా బాలయ్య, ప్రస్తుతం తాను హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోకు రెండో సీజన్‌ను స్టార్ట్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు.

Balakrishna: బాలయ్యతో చేయడం అంటే ఓ అద్భుతమంటోన్న డైరెక్టర్!

Balakrishna: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బాలయ్య కెరీర్‌లో ఈ సినిమా 107వ చిత్రంగా వస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా బాలయ్య, ప్రస్తుతం తాను హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోకు రెండో సీజన్‌ను స్టార్ట్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు.

Unstoppable 2: బాలయ్య టాక్ షోకు చంద్రబాబు.. ఇక అభిమానుల సంతోషం అన్‌స్టాపబుల్!

ఇప్పటికే ‘అన్‌స్టాపబుల్ 2’కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. అయితే తాజాగా ఈ టాక్ షోకు సంబంధించి ట్రైలర్ షూటింగ్ జరుగుతోంది. ఈ ట్రైలర్ షూటింగ్‌లో బాలయ్య సరికొత్త అవతారంలో కనిపిస్తాడని నిర్వాహకులు తెలిపారు. అయితే ఈ ట్రైలర్‌ను డైరెక్ట్ చేసే బాధ్యతలు దర్శకుడు ప్రశాంత్ వర్మకు అప్పజెప్పింది ఆహా. ఈ క్రమంలో దర్శకుడు గతంలోనూ బాలయ్యతో కలిసి ‘అన్‌స్టాపబుల్’ మొదటి భాగం కోసం వర్క్ చేయడం అద్భుతంగా అనిపించిందని.. బాలయ్యతో వర్క్ చేసే అవకాశం మరోసారి రావడం తన అదృష్టం అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ.

Unstoppable 2: దెబ్బకు థింకింగ్ మారిపోవాలి.. పండగకే బాలయ్య బాబు ల్యాండ్ అవుతున్నాడా..?

ఇక ఈ ట్రైలర్ అందరికీ నచ్చే విధంగా ఉంటుందని, ప్రేక్షకులు ఈ ట్రైలర్‌ను ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆయన అన్నారు. అన్‌స్టాపబుల్ 2 ట్రైలర్‌ను అక్టోబర్ 4న విజయవాడలో రిలీజ్ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.