BiggBoss 6 Day 31 : హౌస్ లో గాసిప్స్ ఎక్కువైపోయాయి.. స్కూల్ చిల్డ్రన్స్ లా మారిన కంటెస్టెంట్స్..

బిగ్‌బాస్ ఇనయా సుల్తానాను సీక్రెట్ రూమ్ లోకి పిలిచాడు. ఆమెకి ఒక కేక్ ఇచ్చి అది తినాలంటే కంటెస్టెంట్స్ గురించి గాసిప్స్ చెప్పాలని మళ్ళీ కండిషన్ పెట్టాడు. దీంతో ముందు ఇనయా తన గురించే...........

BiggBoss 6 Day 31 : హౌస్ లో గాసిప్స్ ఎక్కువైపోయాయి.. స్కూల్ చిల్డ్రన్స్ లా మారిన కంటెస్టెంట్స్..

BiggBoss 6 Day 31 personal tasks and funny tasks in house

BiggBoss 6 Day 31 :  బిగ్‌బాస్ గత ఎపిసోడ్ లో పర్సనల్ గా టాస్కులు ఇచ్చాడు కొంతమందికి. ఇక ఈ ఎపిసోడ్ లో ఆ టాస్కులు పూర్తి చేయగా మరొకర్ని సీక్రెట్ రూమ్ లోకి పిలిచారు. ఆ తర్వాత స్కూల్ చిల్డ్రన్స్ టాస్క్, మరో టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. కంటెస్టెంట్స్ అంతా పోటీ పడీ ఆ టాస్కులు చేశారు.

బిగ్‌బాస్ ఫైమాకి రాత్రిపూట సీక్రెట్ టాస్క్ ఇవ్వడంతో ఫైమా పడుకోకుండా ఆ టాస్క్ ని పూర్తి చేయడానికి ట్రై చేసింది. మరోపక్క వసంతి, మెరీనా దెయ్యాల గెటప్స్ వేసుకొని కంటెస్టెంస్ట్ ని భయపెట్టారు. ఆ తర్వాత బిగ్‌బాస్ హౌస్ లోకి ఒక కేక్ పంపించి ఎవరైనా నలుగురు మాత్రమే తినాలన్నాడు. ఎవరు తినాలో తేల్చుకునేలోపే టైం అయిపోవడంతో ఆ కేక్ ని వెనక్కి తీసేసుకున్నాడు బిగ్‌బాస్. గతంలో కూడా ఇలాంటి టాస్క్ ని పెట్టాడు బిగ్‌బాస్.

BiggBoss 6 Day 30 : బిగ్‌బాస్ బర్త్ డే అంట.. గీతూకి లంచం ఇచ్చి మరీ..

ఆ తర్వాత బిగ్‌బాస్ ఇనయా సుల్తానాను సీక్రెట్ రూమ్ లోకి పిలిచాడు. ఆమెకి ఒక కేక్ ఇచ్చి అది తినాలంటే కంటెస్టెంట్స్ గురించి గాసిప్స్ చెప్పాలని మళ్ళీ కండిషన్ పెట్టాడు. దీంతో ముందు ఇనయా తన గురించే చెప్పుకోవడం విశేషం. ఇనయా తనకు సూర్య అంటే క్రష్ అని తెలిపింది. సూర్య బాగా నచ్చేస్తున్నాడు అని చెప్పింది. అలాగే అర్జున్ శ్రీసత్యని వదిలేసి వసంతిని తగులుకున్నాడు అని తెలిపింది. ఇంటి సభ్యులు నన్ను పక్కకి పెడుతున్నారు అన్ని విషయాల్లో అంటూ ఎమోషనల్ అయింది. అయినా పోరాడతాను అని చెప్పింది ఇనయా. దీంతో బిగ్‌బాస్ కేక్ ఇచ్చాడు ఇనయాకి.

ఆ తర్వాత హౌస్ లోని మగ కంటెస్టెంట్స్ కాళ్ళకి ఉన్న వెంట్రుకలు పీకాలని ఆడ కంటెస్టెంట్స్ కి టాస్క్ ఇచ్చాడు. అయితే ఇందులో శ్రీహన్, చంటి కి మాత్రం కాళ్ళకి ఉన్న అన్ని వెంట్రుకలు పీకాలని గమ్ ఉన్న పట్టీలు ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో ఈ టాస్క్ చేయడానికి శ్రీసత్య, గీతూ, ఇనయ, వాసంతి, కీర్తి ఎగబడటం విశేషం. వీళ్లంతా కలిసి చంటి, శ్రీహాన్ కాళ్ళకి ఉన్న వెంట్రుకలు పీకుతుంటే వాళ్లిద్దరూ బాగా అరిచారు.

ఆ తర్వాత కంటెస్టెంట్స్ ని స్కూల్ చిల్డ్రన్స్ లా మార్చే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో బాలాదిత్యని టీచర్ గా చేయడంతో కంటెస్టెంట్స్ అంతా కలిసి బాలాదిత్యని ఆడుకున్నారు. ఇలా ఈ ఎపిసోడ్ అంతా సరదాగా సాగిపోయింది.