BiggBoss 6 Day 32 : కొత్త కెప్టెన్ కోసం టాస్కులు.. కంటెస్టెంట్ల కోరికలు.. ఎమోషనల్ ఎపిసోడ్..

ప్రస్తుతం కీర్తి బిగ్‌‍బాస్ కెప్టెన్ గా ఉంది. అయితే ఈ సారి కెప్టెన్సీ టాస్క్ కోసం ఒక ఆరుగురిని కీర్తిని సెలెక్ట్ చేయమనడం విశేషం. కీర్తి సెలెక్ట్ చేసిన ఆరుగురు కెప్టెన్సీకి పోటీ పడతారు అని బిగ్‌‍బాస్ తెలిపాడు. దీంతో కీర్తి..................

BiggBoss 6 Day 32 : కొత్త కెప్టెన్ కోసం టాస్కులు.. కంటెస్టెంట్ల కోరికలు.. ఎమోషనల్ ఎపిసోడ్..

BiggBoss 6 Day 32 captain tasks and emotional episode

BiggBoss 6 Day 32 :  బిగ్‌‍బాస్ లో మొన్నటి ఎపిసోడ్ సరదాగా సాగిపోయింది. ఇక నిన్నటి ఎపిసోడ్ కొంచెం ఎమోషనల్ గా కొంచెం ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం కీర్తి బిగ్‌‍బాస్ కెప్టెన్ గా ఉంది. అయితే ఈ సారి కెప్టెన్సీ టాస్క్ కోసం ఒక ఆరుగురిని కీర్తిని సెలెక్ట్ చేయమనడం విశేషం. కీర్తి సెలెక్ట్ చేసిన ఆరుగురు కెప్టెన్సీకి పోటీ పడతారు అని బిగ్‌‍బాస్ తెలిపాడు. దీంతో కీర్తి ఫైమా, బాలాదిత్య, సింగర్ రేవంత్, రాజ్, గీతూ, సూర్యలను సెలెక్ట్ చేసుకుంది. వాళ్ళని సెలెక్ట్ చేయడంతో మిగిలిన ఇంటి సభ్యులు ఫీల్ అయ్యారు.

కీర్తి సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్స్ కి బిగ్‌‍బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో కొన్ని కర్రలని, వాటికి బ్యాగులు కట్టి ఉంచాడు. ఆ కర్రలని గొడ్డలితో పూర్తిగా కట్ చేస్తే ఆ బ్యాగులు కిందపడతాయి. అందులో బిగ్‌‍బాస్ లోగోకి సంబంధించిన ముక్కలు ఉంటాయి. వాటిని సరిగ్గా అమర్చాలి. ఈ టాస్క్ ని తక్కువ సమయంలో పూర్తి చేసిన ముగ్గురు నెక్స్ట్ టాస్క్ కి వెళ్తారు అని చెప్పాడు బిగ్‌‍బాస్. ఈ టాస్క్ లో సూర్య, బాలాదిత్య, రేవంత్ బాగా ఆడి నెక్స్ట్ టాస్క్ కి వెళ్లారు. వీరి ముగ్గురిలో వచ్చేవారానికి ఎవరో ఒకరు కెప్టెన్ కానున్నారు. ఇక సూర్య బాగా ఆడటంతో ఇనయా హగ్ ఇచ్చింది. ముందు ఎపిసోడ్ లో ఇనయా సూర్య అంటే నాకు ఇష్టం అని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరిని జంటగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు బిగ్‌‍బాస్.

BiggBoss 6 Day 31 : హౌస్ లో గాసిప్స్ ఎక్కువైపోయాయి.. స్కూల్ చిల్డ్రన్స్ లా మారిన కంటెస్టెంట్స్..

ఆ తర్వాత ఒక ఎమోషనల్ ఎపిసోడ్ జరిగింది. గత ఎపిసోడ్స్ లో బిగ్‌‍బాస్ కోర్కెలు తీర్చి ఎంటర్టైన్ చేసినందుకు ఈ సారి కంటెస్టెంట్స్ ని కోరికలు కోరుకోమన్నారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా కూడా ఫ్యామిలీకి సంబంధినచినవే అడిగారు. ఫ్యామిలీ వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్లకి సంబంధించిన గుర్తులు ఉండాలి అని అడిగారు. అందరూ ఇలాంటివే చెప్పడంతో ఎమోషనల్ గా సాగింది ఎపిసోడ్. మరి నేటి ఎపిసోడ్ లో కెప్టెన్ ఎవరవుతారో చూడాలి.