BiggBoss 6 Day 42 : హౌజ్ నుంచి సుదీప ఎలిమినేట్.. డ్యాన్సులు, డైలాగ్స్ తో వీకెండ్ ఎపిసోడ్ రచ్చ..

 బిగ్‌బాస్ సీజన్ 6 సక్సెస్ ఫుల్ గా ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే హౌజ్ నుంచి షాని, నేహా చౌదరి, ఆరోహి, అభినయశ్రీ, చలాకి చంటి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆరోవారంలో ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, సుదీప, శ్రీహాన్, కీర్తి, శ్రీసత్య, రాజశేఖర్, మెరీనా నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో..........................

BiggBoss 6 Day 42 : హౌజ్ నుంచి సుదీప ఎలిమినేట్.. డ్యాన్సులు, డైలాగ్స్ తో వీకెండ్ ఎపిసోడ్ రచ్చ..

BiggBoss 6 Day 42 sudeepa eliminated from house

BiggBoss 6 Day 42 :  బిగ్‌బాస్ సీజన్ 6 సక్సెస్ ఫుల్ గా ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే హౌజ్ నుంచి షాని, నేహా చౌదరి, ఆరోహి, అభినయశ్రీ, చలాకి చంటి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆరోవారంలో ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, సుదీప, శ్రీహాన్, కీర్తి, శ్రీసత్య, రాజశేఖర్, మెరీనా నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో శ్రీసత్యని శనివారం ఎపిసోడ్ లోనే సేవ్ చేశారు. ఇక సండే ఎపిసోడ్ వీకెండ్ ఎపిసోడ్ కావడంతో నాగార్జున స్టెప్పులతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

హౌజ్ లోని కంటెస్టెంట్స్ మీద సెటైర్స్ వేస్తూ అందర్నీ నవ్వించారు. ముఖ్యంగా గీతూతో బాగా ఆడుకున్నారు నాగార్జున. దీంతో మిగిలిన సభ్యులంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. బొమ్మలని చూసి సాంగ్స్ గెస్ చేసే గేమ్ ఇచ్చారు. హౌజ్ లోని సభ్యులని రెండు టీములుగా విడగొట్టి ఈ ఆటని ఆడించారు. గెస్ చేసిన పాటలని ప్లే చేసి సభ్యులచే డ్యాన్సులు వేయించారు. ఆ తర్వాత కొన్ని డైలాగ్స్ ఇచ్చి వాటిని ఒక్కొక్కరిగా ఇంటి సభ్యులకి డెడికేట్ చేయమన్నారు నాగార్జున. ఇలా వీకెండ్ ఫన్ అయ్యాక ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలుపెట్టారు.

నామినేషన్స్ లో ఉన్నవాళ్ళని ముందు నుంచి ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చారు. చివరికి బాలాదిత్య, సుదీప మిగిలారు. వీరిద్దరికి రెండు బ్యాటరీలు ఇచ్చారు. ఎవరి బ్యాటరీ ఛార్జింగ్ లేకపోతే వాళ్ళు ఎలిమినేట్ అని చెప్పారు నాగార్జున. బాలాదిత్య బ్యాటరీ ఛార్జింగ్ ఉండటం, సుదీప బ్యాటరీ ఛార్జింగ్ లేకపోవడంతో సుదీప ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు.

BiggBoss 6 Day 41 : హౌస్ లో గుడ్ ఎవరు బ్యాడ్ ఎవరు?? ఎలిమినేషన్స్ నుంచి నాగార్జున ఎవర్ని సేవ్ చేశారు??

ఎలిమినేషన్ తర్వాత సుదీప స్టేజి మీదకి వచ్చింది. తన AV ని ప్లే చేయగా అది చూసింది. సుదీప మాట్లాడుతూ.. నా భర్త రెండు వారల కంటే ఎక్కువగా ఉండలేవు అన్నాడు. కానీ ఆరువారాలు ఉన్నాను. హౌజ్ లో చాలా విషయాలు నేర్చుకున్నాను అని తెలిపింది. ఇక హౌజ్ లోని సభ్యులని కూరగాయలతో పోల్చమని నాగార్జున చెప్పడంతో ఒక్కొక్కరిని ఒక్కో కూరగాయతో పోల్చింది సుదీప.