BiggBoss 6 Day 43 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే.. బురద నీళ్లతో నామినేషన్స్.. గొడవలతో దద్దరిల్లిన బిగ్‌బాస్

వీకెండ్ ఎపిసోడ్ అయిపోవడంతో సోమవారం ఎపిసోడ్ నామినేషన్స్ తో హీట్ ఎక్కింది. నామినేషన్స్ ప్రక్రియ మొదలవ్వడంతో కంటెస్టెంట్స్ మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఈ సారి బురద నీళ్లు పోసుకోవాలని నామినేట్ అయిన వాళ్ళు అని బిగ్‌బాస్ చెప్పడంతో ఓ షవర్ నుంచి బురద నీళ్లు పడుతుండగా దాని కింద...............

BiggBoss 6 Day 43 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే.. బురద నీళ్లతో నామినేషన్స్.. గొడవలతో దద్దరిల్లిన బిగ్‌బాస్

BiggBoss 6 Day 43 nominations are in full heat

BiggBoss 6 Day 43 :  వీకెండ్ ఎపిసోడ్ అయిపోవడంతో సోమవారం ఎపిసోడ్ నామినేషన్స్ తో హీట్ ఎక్కింది. నాగార్జున ఇనయాకి వార్నింగ్ ఇవ్వడంతో ఇనయా, సూర్య కాసేపు గేమ్ గురించి మాట్లాడారు. ఇకపై తానేంటో చూపిస్తా అని ఇనయా చెప్పగా సూర్య కూడా ఇనయా ఇకపై గేమ్ ఆడేలా చేస్తాను అని చెప్పడం విశేషం.

ఇక నామినేషన్స్ ప్రక్రియ మొదలవ్వడంతో కంటెస్టెంట్స్ మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఈ సారి బురద నీళ్లు పోసుకోవాలని నామినేట్ అయిన వాళ్ళు అని బిగ్‌బాస్ చెప్పడంతో ఓ షవర్ నుంచి బురద నీళ్లు పడుతుండగా దాని కింద కూర్చున్నారు నామినేట్ అయిన వాళ్ళు. ఈ సారి నామినేషన్స్ మరింత హీట్ గా సాగాయి.

అన్నా చెల్లెళ్లుగా చెప్పుకునే గీతూ, బాలాదిత్య మధ్యలో విబేధాలు వచ్చాయి. గీతూ బాలాదిత్యని నామినేట్ చేయడంతో నాగార్జున నువ్వు మోసం చేశావని ఓ వీడియో చూపించారు, కానీ అది నిజం అని ఇప్పుడు తెలుస్తుందని చెప్పి బాలాదిత్య బాగా హర్ట్ అయ్యాడు. ఇక శ్రీహాన్ ఇనయాని తాను చేసినవి గుర్తుచేయడంతో ఇనయా సీరియస్ అయి ఏం పీకుతావ్ అంటూ ఇష్టమొచ్చినట్టు మాట్లాడింది. దీంతో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది.

శ్రీసత్య, రేవంత్ కి మధ్య కూడా పెద్ద గొడవే జరిగింది. ఇక అర్జున్, ఆదిరెడ్డి అయితే కొట్టుకునేదాకా వెళ్లారు. ఆదిరెడ్డి ముందు నుంచి హడావిడి చేస్తూ ప్రతిదానికి అరుస్తున్న సంగతి తెలిసిందే. నామినేషన్స్ లో కూడా అర్జున్ కూల్ గా మాట్లాడుతుంటే ఆదిరెడ్డి అరుస్తూ ఫైర్ అయ్యాడు. మెరీనా విషయంలో కూడా ఆదిరెడ్డి ఫైర్ అయ్యాడు. మరోవైపు రాజ్, వాసంతి కూడా గొడవపడ్డారు. అందరూ బాలాదిత్యని మంచోడు అంటూనే ఈ వారం ఎక్కువమంది బాలాదిత్యని నామినేట్ చేయడం విశేషం. అలాగే రేవంత్ ని కూడా నిద్రపోతున్నావు ఎక్కువగా అని చాలా మంది నామినేట్ చేయడంతో షర్ట్ విప్పేసి బురద నీళ్ల కింద కూర్చున్నాడు. చివర్లో పుష్ప లాగా తగ్గేదేలే అంటూ యాక్షన్ చేశాడు. రాజ్ కూడా షర్ట్ విప్పేసి బురద నీళ్ల కింద కూర్చున్నాడు.

BiggBoss 6 Day 42 : హౌజ్ నుంచి సుదీప ఎలిమినేట్.. డ్యాన్సులు, డైలాగ్స్ తో వీకెండ్ ఎపిసోడ్ రచ్చ..

మొత్తంగా ఈ వారం నామినేషన్స్ లో అత్యధికంగా 13 మంది నామినేట్‌ అయ్యారు. రేవంత్‌, బాలాదిత్య, రోహిత్‌, వాసంతి, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, ఇనయ, అర్జున్‌, కీర్తి, శ్రీ సత్య, మెరీనా, రాజ్‌, ఫైమాలు ఏడో వారం నామినేషన్స్ లో ఉన్నారు.