BiggBoss 6 Day 44 : ఇష్టం లేకపోతే హౌజ్ నుంచి వెళ్లిపోండి.. కంటెస్టెంట్స్ మీద సీరియస్ అయిన బిగ్‌బాస్

ఈ సీజన్ బిగ్‌బాస్ అనుకున్నంతగా ఫేమస్ అవ్వట్లేదు. నామినేషన్స్, వీకెండ్స్ తప్ప మిగిలిన రోజుల్లో బిగ్‌బాస్ చప్పగా సాగుతుంది. ప్రేక్షకులకి కూడా బోరింగ్ వస్తుంది. దీంతో బిగ్‌బాస్ టీఆర్పీ పెంచడానికి కంటెస్టెంట్స్ మీద ఫైర్ అయ్యాడు............

BiggBoss 6 Day 44 : ఇష్టం లేకపోతే హౌజ్ నుంచి వెళ్లిపోండి.. కంటెస్టెంట్స్ మీద సీరియస్ అయిన బిగ్‌బాస్

BiggBoss 6 Day 44 biggboss fires on contestants

BiggBoss 6 Day 44 :  ఈ సీజన్ బిగ్‌బాస్ అనుకున్నంతగా ఫేమస్ అవ్వట్లేదు. నామినేషన్స్, వీకెండ్స్ తప్ప మిగిలిన రోజుల్లో బిగ్‌బాస్ చప్పగా సాగుతుంది. ప్రేక్షకులకి కూడా బోరింగ్ వస్తుంది. దీంతో బిగ్‌బాస్ టీఆర్పీ పెంచడానికి కంటెస్టెంట్స్ మీద ఫైర్ అయ్యాడు. సోమవారం నామినేషన్స్ చాలా హీట్ హీట్ గా సాగాయి. ఇక మంగళవారం ఎపిసోడ్ లో కెప్టెన్సీ టాస్క్ ని మొదలుపెట్టారు.

కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులని కొంతమంది సెలబ్రిటీల గెటప్స్ వేసుకొని యాక్ట్ చేయమన్నారు. ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ కి ఒక్కో హీరో, హీరోయిన్ పాత్రని ఇచ్చారు. సూర్యకి పుష్ప పాత్రని, గీతూకి శ్రీవల్లి పాత్రని, శ్రీహాన్‌కి చెన్నకేశవరెడ్డి, ఫైమాకి అరుంధతి, మెరీనాకి మిత్రవింద, వాసంతికి బొమ్మరిల్లులోని హాసిని, శ్రీ సత్యకి ఫిదాలోని భానుమతి, రాజ్‌కి చత్రపతిలోని ప్రభాస్‌, అర్జున్‌కి టెంపర్‌లో దయా, కీర్తికి ఒసేయ్ రాములమ్మ, రోహిత్‌కి మగధీర లోని కాళభైరవ, ఇనయకి జగదేక వీరుడు అతిలోక సుందరిలోని శ్రీదేవి పాత్రని, ఆదిరెడ్డికి కూలి నెంబర్‌ 1, బాలాదిత్య భీమ్లా నాయక్‌ పాత్రని ఇచ్చారు.

వారంతా ఆ గెటప్స్ వేసుకొన్నారు. కంటెస్టెంట్స్ ని రెండు టీములుగా విడగొట్టారు. టాలీవుడ్‌ ఫాంటసీ, టాలీవుడ్‌ డైనమైట్‌గా విభజించారు. డైనమైట్‌లో గీతూ, రోహిత్‌, మెరీనా, అర్జున్‌, రాజ్‌, శ్రీసత్య, వాసంతి, సూర్య ఉండగా ఫాంటసీ టీంలో రేవంత్‌, కీర్తి, బాలాదిత్య, ఫైమా, శ్రీహాన్‌, ఆదిరెడ్డి ఉన్నారు. ఇనయా సంచాలకులుగా వ్యవహరించింది.

అయితే ఈ గేమ్ లో కంటెస్టెంట్స్ అలరించే ప్రయత్నం చేసినా సీరియస్ గా చేయలేదు. కొంతమంది ఏదో చేసాము అన్నట్టు చేసి కూర్చున్నారు. దీంతో బిగ్‌బాస్ కి కోపం వచ్చి అందర్నీ గార్డెన్ ఏరియాలోకి పిలిచాడు. అందర్నీ కలిపి తిట్టడం మొదలుపెట్టాడు బిగ్‌బాస్. మీకు అసలు గేమ్ మీద, బిగ్‌బాస్ మీద సీరియస్ లేదని, ఎవ్వరూ సరిగ్గా ఆడట్లేదని, మిమ్మల్ని చూస్తే ప్రేక్షకులకి నీరసం వస్తోందని సీరియస్ అయ్యాడు బిగ్‌బాస్. మరింత సీరియస్ అయి బిగ్‌బాస్ హౌజ్ లో ఉండటం ఇష్టం లేనివాళ్లు వెళ్లిపోవచ్చు అని డోర్స్ ఓపెన్ చేశాడు.

BiggBoss 6 Day 43 : ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే.. బురద నీళ్లతో నామినేషన్స్.. గొడవలతో దద్దరిల్లిన బిగ్‌బాస్

బిగ్‌బాస్ మాట్లాడిన మాటలకి అంతా షాక్ అయ్యారు. దీంతో కాసేపు సైలెంట్ గా ఉన్న కంటెస్టెంట్స్ ఆ తర్వాత బిగ్‌బాస్ ని బతిమాలడం మొదలుపెట్టారు. బిగ్‌బాస్ సీరియస్ అయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కోలా దీనిపై స్పందించారు. ఎవరికి వాళ్ళు వాళ్లే బాగా ఆడుతున్నామని, వేరేవాళ్ళ వల్ల మనల్ని అంటున్నారని కామెంట్స్ చేశారు. లేడి కంటెస్టెంట్స్ కొంతమంది కలిసి మనల్ని కావాలని సపరేట్ చేస్తున్నారని చర్చించుకున్నారు. ఇక శ్రీహాన్ అయితే బిగ్‌బాస్ అంటే ఏంటో తెలియనవాళ్ళని కూడా హౌజ్ లోకి రప్పించారు అని కామెంట్స్ చేశాడు. మరి నేటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ఎలా చేస్తారో, బిగ్‌బాస్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.