BiggBoss 6 Day 56 : సండే ఎలిమినేషన్ లేకుండా.. మరోసారి కొత్తగా బిగ్‌బాస్

 ఈ సారి బిగ్‌బాస్ టీఆర్పీ తగ్గడంతో కొత్తకొత్తగా ప్లాన్ చేస్తున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు. ఈ నేపథ్యంలోనే ప్రతివారం ఆదివారం జరగాల్సిన ఎలిమినేషన్ శనివారం చేసేశారు. శనివారం హౌజ్ నుంచి ఆర్జే సూర్య..............

BiggBoss 6 Day 56 : సండే ఎలిమినేషన్ లేకుండా.. మరోసారి కొత్తగా బిగ్‌బాస్

BiggBoss 6 Day 56 no elimination on sunday

BiggBoss 6 Day 56 :  ఈ సారి బిగ్‌బాస్ టీఆర్పీ తగ్గడంతో కొత్తకొత్తగా ప్లాన్ చేస్తున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు. ఈ నేపథ్యంలోనే ప్రతివారం ఆదివారం జరగాల్సిన ఎలిమినేషన్ శనివారం చేసేశారు. శనివారం హౌజ్ నుంచి ఆర్జే సూర్య ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఇనయా చాలా బాధపడింది. ఆదివారం మరో ఎలిమినేషన్ ఉంటుందని అంతా భావించారు.

ఆదివారం వీకెండ్ ఎపిసోడ్ ని నాగార్జున ఎప్పటిలాగే తన డ్యాన్స్ తో గ్రాండ్ గా మొదలుపెట్టాడు. శనివారం ఎలిమినేట్ అయిన ఆర్జే సూర్యని స్టేజి మీదకి పిలిచాడు నాగార్జున. కంటెస్టెంట్స్ లో ఫ్లవర్స్‌ అనిపించేవాళ్ళు, ఫైర్‌ బ్రాండ్స్‌ అనిపించేవాళ్ళు చెప్పమన్నాడు. రేవంత్‌, గీతూ, శ్రీహాన్‌, బాలాదిత్యలని ఫ్లవర్స్ అని, ఫైమా, ఇనయ, రాజ్‌, కీర్తిలను ఫైర్ అని చెప్పాడు సూర్య.

ఇక ఇనయాతో కాసేపు లవ్ ట్రాక్ నడిచింది. ఇద్దరూ అర్ధం కానీ సైన్ లాంగ్వేజ్ తో మాట్లాడుకున్నారు. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో అర్ధం కాక నాగార్జున అలా చూస్తూ ఉండిపోయాడు. ఇనయాతో మాట్లాడుతూ మొదట్లో ఇనయాతో ఎక్కువ గొడవలయ్యేవని, పదేపదే తిట్టుకునేవాళ్లమని, ఇప్పుడు వెళ్లిపోతున్నా కాబట్టి నా గేమ్‌ కూడా నువ్వే ఆడి టాప్‌ 5లో ఉండాలని చెప్పాడు.

ఇక ఆర్జే సూర్య వెళ్ళాక లైక్‌ షేర్‌ సబ్‌స్క్రైబ్‌ హీరోహీరోయిన్లు సంతోశ్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా స్టేజీపైకి వచ్చారు. ఫరియా నాగార్జునతో కలిసి డ్యాన్సులు వేశారు. ఆ తర్వాత ఇంటిసభ్యులతో ముచ్చటించారు. కంటెస్టెంట్స్ ని రెండు టీమ్స్ గా విడదీసి పాటలని వెరైటీగా పాడించి గెస్ చేయమని చెప్పి కాసేపు ఈ ఆట ఆడించారు. ఆ తర్వాత బిగ్‌బాస్ ఇచ్చిన కొన్ని నేమ్ ప్లేట్స్ లో ఉన్న సినిమా పేర్లని కంటెస్టెంట్స్ లో ఒక్కొక్కరికి ఇవ్వాలని సూచించాడు బిగ్‌బాస్. దీంతో ఆ సినిమా పేర్లని దానికి తగ్గ వాళ్ళకి ఇచ్చారు.

BiggBoss 6 Day 54 : ఈ వారం వరస్ట్ పర్ఫార్మర్ ఎవరో తెలుసా ?? కెప్టెన్ గా పని మొదలుపెట్టిన శ్రీహాన్..

ఇక చివర్లో మళ్ళీ నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాడు. ఈ నామినేషన్ ప్రాసెస్ లో చివరికి ఆదిరెడ్డి, మెరీనా మిగిలారు. అంతా ఆదిరెడ్డి వెళ్ళిపోతాడు అనుకున్నారు. ఆదిరెడ్డి కూడా గీతూలాగే పొగరుగా ఉండటంతో వీరిద్దరూ బాగా కనెక్ట్ అయ్యారని తెలిసిందే. దీంతో ఆదిరెడ్డి వెళ్ళిపోతే హౌజ్ లో నాకు ఎవరూ తోడు ఉండరు అని గీతూ బాధపడింది. కానీ నాగార్జున చివర్లో ట్విస్ట్ ఇచ్చి ఈ వారం ఎలిమినేషన్ లేదనడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక నేటి ఎపిసోడ్ లో మళ్ళీ నామినేషన్స్ ఉండనున్నాయి.