BiggBoss 6 Day 57 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసా??

 బిగ్‌బాస్ లో అప్పుడే ఎనిమిదివారాలు పూర్తయింది. ఎనిమిదో వారం సూర్య ఎలిమినేట్ అయ్యాడు. ఇక సోమవారం ఎపిసోడ్ నామినేషన్స్ తో హీట్ ఎక్కుతుందని తెలిసిందే. వారం అంతా ఎలా ఉన్నా కంటెస్టెంట్స్ అంతా తమ కోపాలని సోమవారం ఎపిసోడ్ లో...........

BiggBoss 6 Day 57 : ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసా??

BiggBoss 6 Day 57 nominations in BiggBoss

BiggBoss 6 Day 57 :  బిగ్‌బాస్ లో అప్పుడే ఎనిమిదివారాలు పూర్తయింది. ఎనిమిదో వారం సూర్య ఎలిమినేట్ అయ్యాడు. ఇక సోమవారం ఎపిసోడ్ నామినేషన్స్ తో హీట్ ఎక్కుతుందని తెలిసిందే. వారం అంతా ఎలా ఉన్నా కంటెస్టెంట్స్ అంతా తమ కోపాలని సోమవారం ఎపిసోడ్ లో చూపిస్తారు. హౌజ్ లో ఇప్పటికే 8 మంది వెళ్లిపోగా ఇంకా 13 మంది మిగిలారు. ఈ సోమవారం కూడా నామినేషన్స్ తో హౌజ్ దద్దరిల్లింది. ఈ సారి హౌజ్ లో ఉన్న వాళ్ళందరి దిష్టిబొమ్మలు పెట్టారు. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ దిష్టిబొమ్మలపై కుండ పెట్టి రీజన్ చెప్పి ఆ కుండని పగలకొట్టి నామినేట్ చేయాలి.

నామినేషన్ మొదట గీతూని చెయ్యమన్నాడు బిగ్‌బాస్. గీతూ భార్యాభర్తలు రోహిత్, మెరీనాలను నామినేట్ చేసింది. మెరీనాకి, గీతూకి గొడవ అయింది. రేవంత్… కీర్తి, ఇనయాలను నామినేట్ చేశాడు. ఇనయాతో గట్టిగానే గొడవ వేసుకున్నాడు. ఈ సారి నామినేషన్స్ లో అందరూ గీతూ, ఇనయాలని టార్గెట్ చేశారు. హౌజ్ లో వాళ్ళిద్దర్నీ నామినేట్ చేయడం కూడా తప్పులేదని ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. గీతూ ఓవర్ యాక్షన్, ఎవరి మాట వినకపోవడం, రూల్స్ కూడా పాటించకుండా నా ఇష్టం అనడంతో గీతూ మీద చాలా నెగిటివిటి వచ్చింది. ఇక ఇనయా తనకు ఎటు కావాలంటే అటు ప్లేట్ తిప్పేయడం, శ్రీహాన్ కి వెన్నుపోటు పొడవడంతో ఇనయా అవసరానికి తగ్గట్టు మారిపోతుంది అంటూ ఎక్కువమందిని ఇనయాని కూడా నామినేట్ చేశారు.

ఆదిరెడ్డి… ఇనయా, రేవంత్ లను నామినేట్ చేశాడు. మెరీనా… శ్రీసత్య, గీతూలని నామినేట్ చేసింది. బాలాదిత్య.. శ్రీసత్య, ఫైమాలని నామినేట్ చేశాడు. కీర్తి… గీతూ, రేవంత్ లని నామినేట్ చేసింది. రోహిత్… గీతూ, శ్రీసత్యలని నామినేట్ చేశాడు. వాసంతి… గీతూ, రేవంత్ లని నామినేట్ చేసింది. రాజ్. .. గీతూ, బాలాదిత్యలని నామినేట్ చేశాడు. ఫైమా… బాలాదిత్య, ఇనయాలని నామినేట్ చేసింది. శ్రీసత్య.. బాలాదిత్య, ఇనయాలని నామినేట్ చేసింది. ఇనయా, శ్రీసత్య గట్టిగానే గొడవపడ్డారు. ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు. ఇనయ… గీతూ, ఆదిరెడ్డి లని నామినేట్ చేసింది. ఈ సమయంలో ఆదిరెడ్డి ఇనయాతో ఓ ఆట ఆడుకున్నాడు. వీరిద్దరి మధ్య కూడా గట్టిగానే గొడవ అయింది. ఇక చివరగా శ్రీహన్… కీర్తి, ఇనయాలను నామినేట్ చేశాడు. శ్రీహాన్ ని వెన్నుపోటు పొడవడంతో వాటన్నిటిని గుర్తు చేస్తూ కౌంటర్లు ఇస్తూ ఇనయాపై పంచులేస్తూ తనని నామినేట్ చేశాడు.

BiggBoss 6 Day 56 : సండే ఎలిమినేషన్ లేకుండా.. మరోసారి కొత్తగా బిగ్‌బాస్

ఎక్కువమంది గీతూ, ఇనయాలనే నామినేట్ చేశారు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ తమని నామినేట్ చేసిన వాళ్లందరితో గొడవ వేసుకున్నారు. మొత్తానికి హౌజ్ లో 13 మంది ఉండగా 10 మంది ఈ వారం నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్ లో రేవంత్, ఆదిరెడ్డి, గీతూ, బాలాదిత్య, కీర్తి, శ్రీసత్య, ఇనయా, రోహిత్, మెరీనా, ఫైమాలు ఉన్నారు. రాజ్, వాసంతి, శ్రీహన్ లకి ఒక్క ఓటు కూడా పడకపోవడం విశేషం. దీంతో వీళ్ళు ముగ్గురు ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. మరి ఈ పదిమందిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.