BiggBoss 6 Day4: బిగ్‌బాస్.. నాలుగో రోజు.. ఇలాంటి వాళ్ళ మధ్య ఉండలేను పంపించండి అంటూ.. రేవంత్ హడావిడి..

ఈ ఎపిసోడ్ హైలెట్ సింగర్ రేవంత్. నామినేషన్స్ రోజు కంటెస్టెంట్స్ అంతా రేవంత్ ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. చాలా మంది రేవంత్ ని నామినేట్ చేశారు. దీంతో రేవంత్ బాధపడ్డాడు. రేవంత్ కి బాలాదిత్య...............

BiggBoss 6 Day4: బిగ్‌బాస్.. నాలుగో రోజు.. ఇలాంటి వాళ్ళ మధ్య ఉండలేను పంపించండి అంటూ.. రేవంత్ హడావిడి..

BiggBoss 6 Day4 upadtes

BiggBoss 6 Day4:  బిగ్‌బాస్ ఈ సారి మొదటి నుంచి రసవత్తరంగా ఉంది. మొదటి వారమే గొడవలు, ఏడుపులు ఉన్నా, ఈ సారి నాలుగు రోజులకే వెళ్ళిపోతామంటూ ఏడ్చేస్తున్నారు. నామినేషన్స్ ప్రక్రియ అయిపోవడంతో కంటెస్టెంట్స్ మధ్య విబేధాలు వచ్చి గ్రూప్స్ గా విడిపోయిన సంగతి తెలిసిందే. నాలుగో రోజు అంతా నామినేషన్స్ గురించే చర్చించుకున్నారు.

ఇక ఎప్పటిలాగే గీతూ రాయల్ హంగామా చేసింది. అరుస్తూ, కౌంటర్లేస్తు, తానే డామినేట్ గా ఉండాలని ప్రయత్నించింది. గీతూ మాటలకి చంటి ఇన్వాల్వ్ అవ్వడంతో ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరిగింది. ఇక ఈ ఎపిసోడ్ హైలెట్ సింగర్ రేవంత్. నామినేషన్స్ రోజు కంటెస్టెంట్స్ అంతా రేవంత్ ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. చాలా మంది రేవంత్ ని నామినేట్ చేశారు. దీంతో రేవంత్ బాధపడ్డాడు. రేవంత్ కి బాలాదిత్య మోటివేషన్ ఇచ్చాడు.

ఇక మరోవైపు మెరీనా తన భర్త మీద లేడీ కంటెస్టెంట్స్ కి సిల్లీ కంప్లైంట్స్ చేస్తుంది. ఆ కంప్లైంట్స్ కి మిగిలిన సభ్యులు నవ్వుకుంటారు. ఇప్పటికే క్లాస్ టీంలో ఉన్న ముగ్గురు కెప్టెన్సీ పోటీకి డైరెక్ట్ గా వెళ్లిపోయారు. మాస్ టీంలోంచి మరో ముగ్గుర్ని కెప్టెన్సీ పోటీకి హౌస్ లో ఉన్న వాళ్లంతా సెలెక్ట్ చేయాలని బిగ్‌బాస్ చెప్పడంతో రోహిత్ అండ్ మెరీనా, ఆర్జే సూర్య, బాలాదిత్యలని కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక చేశారు.

CPI Narayana : చిరంజీవికి, నాగార్జునకు.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.. మెగాస్టార్‌పై నారాయణ ప్రశంసలు

ఆ తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ని రెండు టీమ్స్ గా విడగొట్టి సినిమాలకి సంబంధించిన ప్రశ్నలు అడిగాడు. అయితే ఇందులో ఒక టీం ఓడిపోవడంతో ఆ టీంలో ఉన్న ఆరోహి ఎమోషనల్ అయితే అదే టీంలో ఉన్న రేవంత్ ఆరోహి వల్లే ఓడిపోయాం అనడంతో వీరిద్దరి మధ్య గొడవ అయ్యింది. రేవంత్ మరోసారి ఆదిరెడ్డితో గొడవపడ్డాడు. ఇలా రోజంతా రేవంత్ హైలెట్ అవ్వడంతో చివర్లో రేవంత్ కెమెరా ముందుకొచ్చి ఏడుస్తూ.. నా వల్ల ప్రాబ్లమ్‌ అనుకుంటే నన్ను పంపించేయండి, అంతేకానీ ఇలా నటిస్తూ ఒకర్ని సంతోషపెట్టడం కోసం నా క్యారెక్టర్‌ను నేను చంపుకోలేను. ఇక్కడ చాలామంది గ్రూప్‌గా ఆడుతున్నారు. నేను సింగిల్‌గా ఎన్నిరోజులైనా ఆడతాను. ఇలాంటి వాళ్ళ మధ్య నేను ఉండటం కరెక్ట్ కాదు. నన్ను పంపించేయండి అంటూ ఎమోషనల్ అయ్యాడు.