CPI Narayana : చిరంజీవికి, నాగార్జునకు.. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.. మెగాస్టార్‌పై నారాయణ ప్రశంసలు
చిరంజీవికి, నాగార్జునుకు నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ప్రజారోగ్యం కోసం చిరంజీవి కోట్లాది రూపాయలను కాదనుకుంటే.. నాగార్జున మాత్రం డబ్బు కోసం బిగ్ బాస్ షో హోస్ట్ గా ఉన్నారని విమర్శించారు.

CPI Narayana : సీపీఐ నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ రియాల్టీ షో పై తాను చేసిన కామెంట్లకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. చిరంజీవికి, నాగార్జునుకు నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ప్రజారోగ్యం కోసం చిరంజీవి కోట్లాది రూపాయలను కాదనుకుని వ్యాపార ప్రకటనలు వదులుకున్నారని ప్రశంసించారు. నాగార్జున మాత్రం డబ్బు కోసం బిగ్ బాస్ షో హోస్ట్ గా ఉన్నారని విమర్శించారు. తాను అసత్యానికే వ్యతిరేకం అని, సినిమా రంగం అంటే తనకెంతో ఇష్టం అని, అలాగే గౌరవం కూడా ఉందని నారాయణ చెప్పారు.
కాగా, ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై తీవ్ర విమర్శలు చేసిన నారాయణ.. ఆ తర్వాత సారీ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా చిరుపై ప్రశంసల వర్షం కురిపించారు నారాయణ. ఇదే సందర్భంలో హీరో నాగార్జునపై విమర్శలు గుప్పించడం హాట్ టాపిక్ గా మారింది.
”సినిమా రంగం అంటే కేవలం హీరో నాగార్జున మాత్రమే కాదు. చిరంజీవికి, నాగార్జునకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. డబ్బు కోసం నాగార్జున బిగ్‌బాస్ రియాల్టీ షో హోస్ట్‌గా చేస్తున్నారు. ఇదే చిరంజీవి విషయానికి వస్తే ప్రజారోగ్యం కోసం కోట్లాది రూపాయలను కాదనుకున్న వ్యాపార ప్రకటనలు వదులుకున్నారు” అని మెగాస్టార్ పై ప్రశంసలు కురిపించారు నారాయణ.
భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవిని పిలవడంపై నారాయణ తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్ తో కలిసి చిరంజీవి వేదిక పంచుకున్నారు. ఈ విషయంపైనే మాట్లాడిన నారాయణ.. చిరంజీని తీరును తీవ్రంగా తప్పుపట్టారు. చిరంజీవి ఊసరవెల్లితో పోల్చారు. అంతేకాదు చిరంజీవి చిల్లర బేరగాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమాలో అల్లూరిగా నటించి ప్రేక్షకులకు అల్లూరిని పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణను పిలవకుండా చిల్లర బేరగాడు చిరంజీవిని స్టేజి మీదకు తీసుకొచ్చారని నారాయణ కామెంట్ చేశారు. దీంతో నారాయణపై మెగా అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ తర్వాత నారాయణ.. చిరుకి సారీ చెప్పి.. వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.
కాగా.. బిగ్‌బాస్ రియాల్టీ షోపై నారాయణ తన ఆగ్రహాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రియాల్టీ షోపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బిగ్‌బాస్ రియాల్టీ షో ఓ బ్రోతల్ హౌస్ అని తాను చేసిన కామెంట్స్‌కు కట్టుబడి ఉన్నట్టు నారాయణ తేల్చి చెప్పారు. బ్రోతల్ హౌస్‌లో మహిళలతో పాటు పురుషులు కూడా ఉంటారని చెప్పుకొచ్చారు. మహిళలను కించపరిచినట్టు తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోందన్న నారాయణ.. తనను బ్లాక్ మెయిల్ చేయడం ఎవరి వల్ల కాదన్నారు. కాగా, కళాకారులపై తనకు గౌరవం ఉందన్నారు.