BiggBoss 6 First Week Nominations : బిగ్‌బాస్‌ నామినేషన్స్ మొదలు.. మొదటి వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..

ఎప్పటిలాగే బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ మధ్య గొడవ పెట్టెలాగానే నామినేషన్స్ ప్రక్రియ పెట్టాడు. క్లాస్ టీం వాళ్ళు, ట్రాష్ టీం ద్వారా ఆల్రెడీ నామినేషన్స్ కి వెళ్లిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్లంతా నామినేషన్ ప్రక్రియలో పాల్గొనాలి........

BiggBoss 6 First Week Nominations : బిగ్‌బాస్‌ నామినేషన్స్ మొదలు.. మొదటి వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..

bb6 first week nominations

BiggBoss 6 First Week Nominations :  బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ కి ఇచ్చిన క్లాస్‌, మాస్‌, ట్రాష్‌ టాస్క్ ముగిసింది. ఇక నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ముందుగా ట్రాష్‌లో ఉన్న ఆదిత్య, ఇనయ, అభినయ శ్రీ నేరుగా ఈ వారం నామినేట్‌ అయ్యారు. చివర్లో బిగ్‌బాస్‌ ఓ ట్విస్ట్‌ ఇచ్చి ట్రాష్‌లోని సభ్యులొకరు మాస్‌ టీమ్‌ మెంబర్‌తో స్వాప్‌ అవ్వొచ్చని చెప్పడంతో దీంతో బాలాదిత్యను సేఫ్‌ చేసి ఆ స్థానంలోకి ఆరోహిని పంపించారు. క్లాస్‌ టీమ్‌లో ఉన్న గీతూ, ఆదిరెడ్డి, నేహా ఈవారం నామినేషన్‌ నుంచి తప్పించుకున్నారు.

ఎప్పటిలాగే బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ మధ్య గొడవ పెట్టెలాగానే నామినేషన్స్ ప్రక్రియ పెట్టాడు. క్లాస్ టీం వాళ్ళు, ట్రాష్ టీం ద్వారా ఆల్రెడీ నామినేషన్స్ కి వెళ్లిన వాళ్ళు తప్ప మిగిలిన వాళ్లంతా నామినేషన్ ప్రక్రియలో పాల్గొనాలి. అలాగే వాళ్ళని ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెప్పి నామినేట్ చేయాలి అన్నాడు బిగ్‌బాస్‌. దీంతో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి.

మొదట సింగర్ రేవంత్‌ వచ్చి.. హౌస్ లో ఫైమా పని చేయట్లేదంటూ ఫైమాని, నేను నిద్రపోయినప్పుడు సూర్యతో ముచ్చట్లు పెడుతూ నిద్ర డిస్టర్బ్‌ చేసిందని ఆరోహిని నామినేట్ చేశాడు. వీటికి ఫైమా స్పందిస్తూ నేను పనిచేస్తున్నప్పుడు నువ్వు చూడకపోతే అది నా తప్పు కాదు అని సీరియస్ అయింది. ఇక ఆరోహి ఆ రోజు మీ నిద్ర డిస్టర్బ్‌ చేసినందుకు మీదగ్గరకు వచ్చి సారీ కూడా చెప్పాను, అనవసరంగా నన్ను బద్నాం చేయకండి అని కౌంటరిచ్చింది.

ఆ తర్వాత కీర్తి భట్‌ వచ్చి.. నాకు, శ్రీహాన్‌కు మధ్య ఉన్న బంధంపై రేవంత్‌ జోక్‌ చేశాడు. సరే అని నేను శ్రీహాన్‌ను చోటు భయ్యా అని పిలుస్తుంటే శ్రీహాన్‌ సరిగా మాట్లాడట్లేదు. అందుకే వీరిద్దర్నీ నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. అలాగే ఇంటిపనుల్లో భాగమవ్వట్లేదంటూ చంటిని కూడా నామినేట్ చేసింది.

తర్వాత ఆరోహి.. మీకు తెలీకుండానే అందరినీ హర్ట్‌ చేస్తున్నావంటూ రేవంత్‌ను, నేను ప్రేమగా శ్రీసత్య అని చాలాసార్లు పిలిచినా నువ్వు ఒక్కసారి కూడా నాతో ప్రేమగా మాట్లాడలేదంటూ శ్రీసత్యను నామినేట్‌ చేసింది. రాజశేఖర్ ని కూడా నామినేట్ చేసింది.

శ్రీసత్య.. నా లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నేను మనుషులతో మాట్లాడటం మానేశాను. కొత్తవాళ్లతో మాట్లాడటానికి టైం పడుతుంది. నాకు యాటిట్యూడ్‌ లేదు అని చెప్తూ ఆరోహి, వాసంతి, రాజశేఖర్‌ లను నామినేట్‌ చేసింది.

సుదీప.. సరిగ్గా మాట్లాడటంరాదు అని రేవంత్‌ ని నామినేట్ చేసింది, పనులు చెయ్యట్లేదు అంటూ చంటిని నామినేట్ చేసింది.

ఫైమా.. రేవంత్‌ తానే కరెక్ట్ అంటూ మాట్లాడుతాడు అని రేవంత్ ని, నా గురించి తప్పుగా మాట్లాడడేమో అని అర్జున్‌ ని నామినేట్ చేసింది.

వాసంతి.. నేను పని చేయట్లేదంటూ రేవంత్‌ అన్నాడు అందుకే రేవంత్ ని, అలాగే యాటిట్యూడ్‌ చూపిస్తుందని శ్రీ సత్యను నామినేట్‌ చేసింది.

చంటి.. రేవంత్‌ ఎదుటి వాళ్ళు చెప్పింది వినడు అని నామినేట్ చేశాడు, సుదీప నేను పని చేయట్లేదని అంది, ఆల్రెడీ పనులు అప్పచెప్పారు, మళ్ళీ నేను వెళ్లి మధ్యలో ఎందుకు దూరుతాను, అందరితో ఇంకా కనెక్ట్ అవ్వలేదు అందుకే తాను చెప్పింది తప్పు అని సుదీపని నామినేట్ చేశాడు.

ఆర్జే సూర్య.. రేవంత్‌ ని నామినేట్ చేస్తూ సరిగ్గా మాట్లాడడు, చెప్పేది వినడు అని చెప్పాడు. చంటిని పని చేయట్లేదంటూ నామినేట్ చేశాడు.

మెరీనా- రోహిత్‌ కపుల్ కలిసి.. ఫైమా పనిచేయట్లేదని, చంటిని కూడా పనిచేయట్లేదని నామినేట్ చేశారు.

శ్రీహాన్‌.. రేవంత్‌ కి సరిగ్గా మాట్లాడటం రాదు అని, కీర్తి నన్ను సరిగ్గా అర్ధం చేసుకోలేదు అని ఇద్దర్ని నామినేట్ చేశారు.

అర్జున్‌.. ఫైమా సరిగా అర్ధం చేసుకోవట్లేదు, సరిగ్గా పనులు చేయట్లేదంటూ నామినేట్ చేశాడు. ఆరోహి మాట్లాడిన మాటలకు హర్ట్ అయ్యాను అంటూ ఆరోహిని నామినేట్ చేశాడు.

రాజశేఖర్‌.. వాసంతి, శ్రీ సత్యలను

షాని.. శ్రీసత్య, చంటిలని నామినేట్ చేశారు.

BiggBoss 6 Marina And Rohit: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ మెరీనా-రోహిత్‌ జోడీ గురించి మీకు తెలుసా..

దీంతో ఒకరిపై ఒకరికి అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. గొడవలు ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు మొదలయ్యాయి. మొత్తంగా మొదటి వారం నామినేషన్స్ లో అత్యధికంగా ఓట్లు ఉన్న రేవంత్‌, చంటి, శ్రీసత్య, ఫైమాలు, ట్రాష్ ద్వారా వచ్చిన ఇనయా, ఆరోహి, అభినయశ్రీ నామినేషన్స్ లో ఉన్నారు. మొత్తంగా ఏడుగురు కంటెస్టెంట్స్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. మరి వీరిలోంచి ఎవరు ఈ వారం బయటకి వెళ్తారో చూడాలి.