BiggBoss 6 Marina And Rohit: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ మెరీనా-రోహిత్‌ జోడీ గురించి మీకు తెలుసా..

బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో మెరీనా అబ్రహం, రోహిత్‌ సహ్ని సెలెబ్రెటీ కపుల్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. మెరీనా 2016లో "రొమాన్స్ విత్ ఫైనాన్స్" సినిమాతో వెండితెరకు పరిచయం కాగా రోహిత్‌ మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి, 2015లో "చిరుగొడవలు" సినిమాతో వెండితెర అరంగేట్రం చేశాడు.

BiggBoss 6 Marina And Rohit: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్ మెరీనా-రోహిత్‌ జోడీ గురించి మీకు తెలుసా..

Do You Know About BiggBoss Couple Contestants Marina And Rohit

BiggBoss 6 Marina And Rohit: బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా మొదలయింది. “ఈ ఫీల్డ్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే అది నా తరవాతే” అంటూ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున. ఆ తర్వాత బంగార్రాజు టైటిల్‌ సాంగ్‌కి మోడల్స్‌తో కలిసి స్టెప్పులేశారు. మనకి రుచులు ఆరు, రుతువులు ఆరు, ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌ కూడా ఆరు అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్‌ బిగ్‌బాస్‌ 6 అని షో గురించి చెప్పుకొచ్చాడు నాగార్జున. ఆ తర్వాత తనే హౌస్‌లోకి వెళ్లి హౌస్ మొత్తాన్ని చూపించారు. ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో కంటే కూడా మరింత రిచ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్స్ ని స్టేజి మీదకి పిలిచాడు.

BiggBoss 6 Geetu Royal: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గీతూ రాయల్‌ గురించి మీకు తెలుసా..

ఈ సీజన్‌లో మెరీనా అబ్రహం, రోహిత్‌ సహ్ని సెలెబ్రెటీ కపుల్ కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. మెరీనా 2016లో “రొమాన్స్ విత్ ఫైనాన్స్” సినిమాతో వెండితెరకు పరిచయం కాగా ‘అమెరికా అమ్మాయి’ సీరియల్‌తో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే ‘సబ్ క దిల్ ఖుష్ హువా’ అనే హిందీ చిత్రంలోనూ నటించింది. 2017లో హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ అవార్డు కూడా గెలుచుకుంది.

అలానే రోహిత్‌ మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి, 2015లో “చిరుగొడవలు” సినిమాతో వెండితెర అరంగేట్రం చేశాడు. ఆ తరువాత కలుసుకోవాలని, అభిషేకం, నీలికలువలు, అమృత వర్షిణి, అభిలాష వంటి సీరియల్స్‌తో పాపులర్‌ అయ్యాడు. 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్న మెరీనా-రోహిత్‌ జంట బిగ్‌బాస్‌ హౌస్ లోకి వరుణ్‌ అండ్‌ వితికా తరువాత రెండో సెలెబ్రెటీ జోడీగా అడుగుపెడుతున్నారు. ఇక ఈ జోడీ ప్రేక్షకులని ఎంతవరకు అలరించగలదో చూడాల్సి ఉంది.