BiggBoss 6 Geetu Royal: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గీతూ రాయల్‌ గురించి మీకు తెలుసా..

బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా మొదలయింది. ఈ సీజన్‌లో 8వ కంటెస్టెంట్‌గా గీతూ రాయల్‌ ఎంట్రీ ఇచ్చింది. తన యాసతో సోషల్‌ మీడియాలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గీతూ ఫామిలీ చిన్నప్పటి నుంచి ఆర్థికంగా బాగా స్థిరంగా ఉన్న కుటుంబం. అయితే ఆమె నాలుగవ యేట....

BiggBoss 6 Geetu Royal: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ గీతూ రాయల్‌ గురించి మీకు తెలుసా..

Do You Know About BigBoss Contestant Geetu Royal

BiggBoss 6 Geetu Royal: బిగ్‌బాస్‌ సీజన్‌ 6 ఆదివారం సాయంత్రం గ్రాండ్ గా మొదలయింది. “ఈ ఫీల్డ్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే అది నా తరవాతే” అంటూ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున. ఆ తర్వాత బంగార్రాజు టైటిల్‌ సాంగ్‌కి మోడల్స్‌తో కలిసి స్టెప్పులేశారు. మనకి రుచులు ఆరు, రుతువులు ఆరు, ఇప్పుడు బిగ్‌బాస్‌ సీజన్‌ కూడా ఆరు అందుకే ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్‌ బిగ్‌బాస్‌ 6 అని షో గురించి చెప్పుకొచ్చాడు నాగార్జున. ఆ తర్వాత తనే హౌస్‌లోకి వెళ్లి హౌస్ మొత్తాన్ని చూపించారు. ఈసారి బిగ్ బాస్ ఇల్లు గత సీజన్లలో కంటే కూడా మరింత రిచ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఒక్కొక్క కంటెస్టెంట్స్ ని స్టేజి మీదకి పిలిచాడు.

BiggBoss 6 Arjun Kalyan: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అర్జున్‌ కళ్యాణ్ గురించి మీకు తెలుసా..

ఈ సీజన్‌లో 8వ కంటెస్టెంట్‌గా గీతూ రాయల్‌ ఎంట్రీ ఇచ్చింది. తన యాసతో సోషల్‌ మీడియాలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న గీతూ ఫామిలీ చిన్నప్పటి నుంచి ఆర్థికంగా బాగా స్థిరంగా ఉన్న కుటుంబం. అయితే ఆమె నాలుగవ యేట తండ్రి బిజినెస్ లో లాస్ అవ్వడంతో అప్పటినుంచి వాళ్ళ అమ్మగారే గీతూని చూసుకుంటూ వచ్చారు. చదువు పూర్తి చేసుకున్నాక అమెజాన్ లో కొన్నాళ్ళు పని చేసింది.

సాంస్కృతిక కార్యక్రమాలలో చురుగ్గా ఉండే గీతూ డబ్ స్మాష్, టిక్ టాక్, ఇన్స్టారీల్స్ చేస్తూ ఉండేది. ఇలా ఒకరోజు తనకు తానుగా ఒక ఇన్స్పిరేషనల్ వీడియో చేసి పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అవ్వడంతో, వాటితో పాటు బిగ్‌బాస్‌ రివ్యూలు ఇవ్వడం కూడా స్టార్ట్ చేసింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ గా, యూట్యూబర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గీతూ రాయల్‌ జబర్దస్త్‌లో చేసిన పుష్ప స్కిట్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఓవర్‌ నైట్‌లో పాపులారిటీ దక్కించుకుంది. మరిప్పటివరకు మాటలతో ఆకట్టుకునే గీతూ రాయల్‌ ఆటతో ఎంతవరకు ఆకట్టుకోగలదో చూడాలి.