BiggBoss 6: బిగ్‌బాస్ మొదటి కెప్టెన్సీ పోటీ మొదలు.. నేటి ఎపిసోడ్‌లో ఉత్కంఠ పోరు

బిగ్‌బాస్ 6 స్టార్ట్ అయ్యి బుల్లితెరపై సందడి చేయడం మొదలుపెట్టింది. కంటెస్టెంట్స్ తమ అల్లర్లు, గొడవలు, ఏడుపులతో కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా సాగిపోతున్నారు. నామినేషన్స్ ప్రక్రియ జరగడంతో ఎవరికివారు ఆలోచనల్లో పడ్డారు. ఇక బిగ్‌బాస్ నిర్వాహకులు నేటి ప్రోమో విడుదల చేయగా, బిగ్‌బాస్ నేడు కెప్టెన్సీ పోరు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.

BiggBoss 6: బిగ్‌బాస్ మొదటి కెప్టెన్సీ పోటీ మొదలు.. నేటి ఎపిసోడ్‌లో ఉత్కంఠ పోరు

BiggBoss 6 Latest Prome Released

BiggBoss 6: బిగ్‌బాస్ 6 స్టార్ట్ అయ్యి బుల్లితెరపై సందడి చేయడం మొదలుపెట్టింది. కంటెస్టెంట్స్ తమ అల్లర్లు, గొడవలు, ఏడుపులతో కొంచెం కష్టంగా కొంచెం ఇష్టంగా సాగిపోతున్నారు. నామినేషన్స్ ప్రక్రియ జరగడంతో ఎవరికివారు ఆలోచనల్లో పడ్డారు. నిన్నంతా రేవంత్ తనని ఎందుకు నామినేట్ చేసారంటూ బాధతోనే కూర్చోగా, అందరూ తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియడం లేదంటూ ఇనాయ వాపోయింది.

BiggBoss 6 Day4: బిగ్‌బాస్.. నాలుగో రోజు.. ఇలాంటి వాళ్ళ మధ్య ఉండలేను పంపించండి అంటూ.. రేవంత్ హడావిడి..

ఇక బిగ్‌బాస్ నిర్వాహకులు నేటి ప్రోమో విడుదల చేయగా, బిగ్‌బాస్ నేడు కెప్టెన్సీ పోరు పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఈ పోరుతో కంటెస్టెంట్స్ మధ్య పోటీ మరింత ఉత్కంఠగా సాగబోతున్నట్లు అర్ధమవుతుంది. బిగ్‌బాస్ 6 మొదటి కెప్టెన్సీ అవ్వడానికి ముందు చేయవల్సిన టాస్క్ గురించి ఈ ప్రోమోలో చూపించారు. “కెప్టెన్సీ బండి” అని ఇచ్చిన టాస్క్ లో కెప్టెన్సీ పోటీకి అర్హురాలైన కంటెస్టెంట్స్ మధ్య పోరుని విడుదలైన ప్రోమోలో చూపించారు.

ఈ పోటీకి రిఫరీగా ఫైమా వ్యవహరిస్తునట్టు ఈ వీడియోలో తెలుస్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెపుతూ, కంటెస్టెంట్స్ ని కంట్రోల్ చేస్తూ, ముఖ్యంగా నేహా చౌదరి, రేవంత్ లకు రూల్స్ ఫాలో అవ్వాలంటూ సీరియస్ అవుతూ ఫైమా అదరగొడుతుంది. అయితే బిగ్‌బాస్ 6 మొదటి కెప్టెన్సీ ఎవరు అవుతారో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.