BiggBoss 6 : బిగ్‌బాస్‌ సీజన్ 6 వచ్చేస్తుంది.. కంటెస్టెంట్స్ వీళ్లేనా?

తాజాగా బిగ్‌బాస్‌ సీజన్ 6 లోగో రివీల్ చేశారు. అయితే ఎప్పట్నించి మొదలవుతుంది అనేది ఇంకా ప్రకటించలేదు. ఈ సారి బిగ్‌బాస్‌ లో కొంతమంది సెలబ్రిటీలు ఉండనున్నట్టు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో.........

BiggBoss 6 : బిగ్‌బాస్‌ సీజన్ 6 వచ్చేస్తుంది.. కంటెస్టెంట్స్ వీళ్లేనా?

BiggBoss 6 :  బిగ్‌బాస్‌ షో తెలుగులో కూడా బాగా పాపులర్ అయింది. చాలా మంది ఈ షోతో పాపులారిటీ తెచ్చుకున్నారు. మరి కొంతమంది ఫామ్ లోకి వచ్చారు. చాలా మందిని బిగ్‌బాస్‌ షో సెలబ్రిటీలను చేసింది. తెలుగులో కూడా ఈ షోకి చాలా మంది అభిమానులు ఉన్నారు. కొంతమంది కంటెస్టెంట్స్ ని ఒక హౌస్ లో ఉంచి వాళ్ళకి పలు రకాల టాస్క్ లు ఇచ్చి చివరి వరకు ఉన్నవారిని విన్నర్ గా ప్రకటిస్తారు. ఇందులో పాల్గొనేవాళ్ళకి ఫేమ్ తో పాటు డబ్బులు కూడా బాగానే వస్తాయి.

గత మూడు సీజన్ల నుంచి నాగార్జుననే బిగ్‌బాస్‌ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సారి బిగ్‌బాస్‌ సీజన్‌ 6 కూడా నాగార్జుననే యాంకర్ గా చేయనున్నారు. అలాగే ఈ సారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులని కూడా ఈ షోలో తీసుకోనున్నారు. లాస్ట్ టైం ఓటీటీలో టెలికాస్ట్ చేసినప్పుడు ఎక్కువగా రీచ్ అవ్వలేదు. దీంతో ఈ సారి మళ్ళీ టీవీలోనే టెలికాస్ట్ చేయనున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ సీజన్ 6 లోగో రివీల్ చేశారు. అయితే ఎప్పట్నించి మొదలవుతుంది అనేది ఇంకా ప్రకటించలేదు.

Adurs Raghu : ప్రముఖ హాస్యనటుడికి పితృవియోగం.. విషాదంలో జబర్దస్త్ నటులు..

ఈ సారి బిగ్‌బాస్‌ లో కొంతమంది సెలబ్రిటీలు ఉండనున్నట్టు పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో యాంకర్ మంజూష, హీరోయిన్ ఆశా సైనీ, హీరో లక్ష్, ట్రాన్సజెండర్ తన్మయి, న్యూస్ యాంకర్ పద్మిని, ఆర్టిస్ట్ సంజన చౌదరి, యూట్యూబ్ ఆర్టిస్ట్ కుషిత, యాక్టర్ భరత్, సీరియల్ ఆక్టర్ కౌశిక్, హీరో సుమంత్ అశ్విన్, హీరోయిన్ ప్రీతీ అస్రానితో పాటు మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఈ సారి సీజన్ ఎంత రసవత్తరంగా ఉండబోతుందో చూడాలి. బిగ్‌బాస్‌ ఫ్యాన్స్ ఈ షో కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.