Adurs Raghu : ప్రముఖ హాస్యనటుడికి పితృవియోగం.. విషాదంలో జబర్దస్త్ నటులు..

తాజాగా హాస్యనటుడు రఘు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెంకట్రావ్ కారుమంచి (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రావ్ గురువారం సాయంత్రం..........

Adurs Raghu : ప్రముఖ హాస్యనటుడికి పితృవియోగం.. విషాదంలో జబర్దస్త్ నటులు..

Updated On : August 4, 2022 / 9:19 PM IST

Adurs Raghu :  ‘అదుర్స్’ సినిమాలో తన కామెడీతో అందర్నీ మెప్పించి మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకొని పలు సినిమాల్లో కమెడియన్ గా నటించాడు రఘు. ఆ తర్వాత జబర్దస్త్ లో రోలర్ రఘు పేరుతో పాపులర్ అయ్యాడు. జబర్దస్త్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన రఘు అవకాశాలు తగ్గిపోవడంతో సొంతూరు వెళ్లి వ్యవసాయం, లిక్కర్ బిజినెస్ చేసుకుంటూ సెటిల్ అయిపోయాడు.

Janhvi Kapoor : అప్పుడు వద్దని ఇప్పుడు కావాలంటున్న జాన్వీ.. ఇప్పటికైనా ఎంట్రీ ఇస్తుందా?

తాజాగా హాస్యనటుడు రఘు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెంకట్రావ్ కారుమంచి (74) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రావ్ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. అయన గతంలో ఆర్మీ అధికారిగా దేశానికి సేవలదించారు. రిటైర్మెంట్ తర్వాత ఇంటిదగ్గరే ఉంటున్నారు. రఘు తండ్రి వెంకట్రావ్ మృతి పట్ల జబర్దస్త్ కమెడియన్స్ విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. రఘు తండ్రి మరణించారని తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయనకి సంతాపం తెలుపుతున్నారు.