Janhvi Kapoor : అప్పుడు వద్దని ఇప్పుడు కావాలంటున్న జాన్వీ.. ఇప్పటికైనా ఎంట్రీ ఇస్తుందా?

 సినిమాల విషయంలో ఏరికోరి బంపర్ ఆఫరిచ్చినప్పుడు పెద్దగా ఆలోచించకుండా ఓకే అనాలి కానీ అబ్బే ఇప్పుడు కాదని బెట్టు చేస్తే మొదటికే మోసమొస్తుంది. ప్రస్తుతం శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వికపూర్ పరిస్థితి ఇలాగె ఉంది. జాన్వి కపూర్ తన సినిమాల కంటే..........

Janhvi Kapoor : అప్పుడు వద్దని ఇప్పుడు కావాలంటున్న జాన్వీ.. ఇప్పటికైనా ఎంట్రీ ఇస్తుందా?

Janhvi Kapoor :  సినిమాల విషయంలో ఏరికోరి బంపర్ ఆఫరిచ్చినప్పుడు పెద్దగా ఆలోచించకుండా ఓకే అనాలి కానీ అబ్బే ఇప్పుడు కాదని బెట్టు చేస్తే మొదటికే మోసమొస్తుంది. ప్రస్తుతం శ్రీదేవి కూతురు, బాలీవుడ్ భామ జాన్వికపూర్ పరిస్థితి ఇలాగె ఉంది. జాన్వి కపూర్ తన సినిమాల కంటే కూడా శ్రీదేవి కూతురు అన్న క్రేజ్ తోనే ఎక్కువమందికి పరిచయం. ప్రజెంట్ బాలీవుడ్ హీరోయిన్ అయినా కూడా సౌత్ కనెక్షన్ ఉండడంతో టాలీవుడ్ జాన్వీని బాగా ఓన్ చేసుకుంది. అందుకే జాన్వి తెలుగులో హీరోయిన్ గా చేస్తే చూడాలని చాలా మంది ఆశపడుతున్నారు. అంతేకాదు జాన్వీని ఎలా అయినా తెలుగులో లాంచ్ చెయ్యాలని పెద్ద ఆఫర్లు కూడా ఇచ్చారు స్టార్ డైరెక్టర్లు. కానీ అమ్మడు మాత్రం అప్పుడు నో అనేసింది.

జాన్వికపూర్ కి పూరీ జగన్, కొరటాల లాంటి స్టార్ డైరెక్టర్లు తెలుగులో హీరోయిన్ గా లాంచ్ చేస్తామని ఆఫరిచ్చారు. పూరీ జగన్ లైగర్ సినిమా కోసం ఫస్ట్ నుంచి జాన్వికపూర్ కోసమే ట్రై చేశారు. మరో వైపు కొరటాల కూడా ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా జాన్విని లాంచ్ చే్ద్దామని ప్రపోజ్ చేశారు. కానీ డేట్స్ లేవని, మిగతా షూటంగ్స్ తో బిజీగా ఉన్నానని, రకరకాల కారణాలతో ఈ అమ్మడు అప్పుడు నో చెప్పేసింది. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయ్యింది.

Prabhas : అల్ట్రా స్టైలిష్ లుక్‌లోకి మారిన ప్రభాస్.. దేనికోసమో?

అవకాశం వచ్చినప్పుడు, ఛాన్స్ ఇచ్చినప్పుడు పట్టించుకోకుండా ఉన్న జాన్వి తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా టాప్ ఇండస్ట్రీ అవ్వడం, ఇండియన్ సినిమాకే హైలెట్ అవ్వడంతో ఇక్కడ అవకాశాల కోసం ట్రై చేస్తున్నాను అని చెప్తుంది. మొన్నీమధ్య కరణ్ జోహార్ షోలో కూడా విజయ్ దేవరకొండతో సినిమా చేస్తానంటూ చెప్పింది జాన్వి. ప్రభాస్ తో ఛాన్స్ వస్తే అస్సలు మిస్సవనంది. ఇక తాజాగా ఎన్టీఆర్ తో అవకాశం వస్తే తప్పకుండా సినిమా చేస్తానంటూ చెబుతోంది

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ సినిమా గురించి మాట్లాడుతూ.. నేను తెలుగు సినిమా లేదా ఏదైనా సౌత్‌ సినిమా చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నాను. ఎన్టీఆర్‌తో పని చేసే అవకాశం వస్తే అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదు. ఆయన చాలా గొప్ప నటుడు. కానీ మీరనుకుంటున్నట్లుగా ఆయన సినిమాలో నాకెలాంటి అవకాశం రాలేదు. ఆయనతో కలిసి పని చేయడానికి నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని తెలిపింది.

NTR : మేనత్త ఇంటికి తల్లి, భార్యతో వెళ్లిన ఎన్టీఆర్.. మేనత్తని తలుచుకొని ఏడుస్తూ..

నిజానికి బాలీవుడ్ లో కూడా జాన్వికపూర్ కి ఇప్పటి వరకూ అప్ టూద మార్క్ సక్సెస్ రానేలేదు. ఏదో ఒకటీ అరా సినిమాలు చేసినా అవి స్టార్ హీరోయిన్ అనిపించుకునేంత రేంజ్ లో ఉన్నవి కాదు. ఈమధ్య రిలీజ్ అయిన గుడ్ లక్ జెర్రీ కూడా జస్ట్ పర్వాలేదనిపించింది. బాలీవుడ్ లో అనుకున్నంత సక్సెస్ లేక, అప్పుడు తెలుగులో వచ్చిన అవకాశాలు మిస్సయ్యి, ఇప్పుడు తెలుగు ఛాన్సుల కోసం జాన్వీ వెయిట్ చేస్తోందని టాక్ వినిపిస్తుంది. మరి ఇప్పుడు మన టాలీవుడ్ స్టార్లు జాన్వీని తీసుకుంటారా? ఇప్పటికైనా టాలీవుడ్ లో జాన్వీ ఎంట్రీ ఇస్తుందా చూడాలి.