Prabhas : అల్ట్రా స్టైలిష్ లుక్‌లోకి మారిన ప్రభాస్.. దేనికోసమో?

బాహుబలి నుంచి కంప్లీట్ ట్రాన్స్ ఫామ్ అవుతున్న ప్రభాస్ రాధేశ్యామ్ లో స్టేబుల్ ఫిగర్ ని మెయింటెన్ చేశారు. కానీ ఆదిపురుష్ కి వచ్చే వరకి మళ్లీ సీన్ మారిపోయింది. ఇక సలార్ లో అయితే హ్యూజ్ బాడీ తో కనిపిస్తున్నారు. సలార్ నుంచి మళ్లీ ఇప్పుడు.......

Prabhas : అల్ట్రా స్టైలిష్ లుక్‌లోకి మారిన ప్రభాస్.. దేనికోసమో?

Prabhas :  సీతారామం సినిమాకి సంబందించి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కానీ అందరూ ఈవెంట్ లో గెస్ట్ గా వచ్చిన ప్రభాస్ నే చూశారు. చాలా రోజుల తర్వాత పబ్లిక్ లో కనిపించిన ప్రభాస్ ని చూసి షాక్ అయ్యారు ఫ్యాన్స్. స్లిమ్ అయిపోయి అల్ట్రా స్టైలిష్ లుక్ లో ప్రభాస్ కనిపించేసరికి ఫుల్ ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.

బాబోయ్ ఏంటి ఇలా తయారయ్యాడు? అసలు ఇతను పాన్ ఇండియా హీరోయేనా? ఫిట్ గా సిక్స్ ప్యాక్ తోఉండే హీరో, ఫేస్ ఏంటి ఇలా అయిపొయింది, ఇలా అడ్డగోలుగా అయిపోయాడేంటి అని మొన్నటి వరకూ ప్రభాస్ ని ట్రోల్ చేశారు. కానీ సీతారామం ఈవెంట్ లో ప్రభాస్ ని చూసి ఎంత బావున్నాడో, ఎంత స్లిమ్ అయిపోయాడో అని సర్ ప్రైజ్ అవుతున్నారు. బాడీ వైజ్, లుక్ వైజ్ బాగా చేంజ్ అయి ఫాన్స్ ని ఫుల్ ఫిదా చేశారు ప్రభాస్.

NTR : మేనత్త ఇంటికి తల్లి, భార్యతో వెళ్లిన ఎన్టీఆర్.. మేనత్తని తలుచుకొని ఏడుస్తూ..

బాహుబలి నుంచి కంప్లీట్ ట్రాన్స్ ఫామ్ అవుతున్న ప్రభాస్ రాధేశ్యామ్ లో స్టేబుల్ ఫిగర్ ని మెయింటెన్ చేశారు. కానీ ఆదిపురుష్ కి వచ్చే వరకి మళ్లీ సీన్ మారిపోయింది. ఇక సలార్ లో అయితే హ్యూజ్ బాడీ తో కనిపిస్తున్నారు. సలార్ నుంచి మళ్లీ ఇప్పుడు ప్రాజెక్ట్ K కి షిఫ్ట్ అవ్వడంతో ఈ సినిమాకి తగినట్టు స్లిమ్ అయిపోయి సూపర్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు అని అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. లేటెస్ట్ లుక్ లో ప్రభాస్ ఫుల్ స్టైలిష్ గా కనిపించారు. ప్రాజెక్టు K కోసమే ప్రభాస్ ఇలా మారారు అని అంతా అనుకుంటున్నారు. ఎవరేమనుకున్నా కూల్ గ్లాసెస్, స్లిమ్ బాడీ, టి షర్ట్, జీన్స్, క్యాప్ తో సీతారామం ఈవెంట్ లో ప్రభాస్ కనపడి తనని ట్రోల్ చేసే వాళ్ళ నోళ్లంతా మూయించేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.