Ishan Kishan : టీ20ల్లో ఇషాన్ కిషన్ కెప్టెన్సీ రికార్డు ఇదే.. ఓరీ నాయనో..
ఐపీఎల్ 2026 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇషాన్ కిషన్(Ishan Kishan)ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది.
Do you know Ishan Kishan captaincy record in T20 cricket
- సన్‌రైజర్స్ హైదరాబాద్ తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
- ఐపీఎల్లో కెప్టెన్‌గా అతడికి ఇదే తొలి ఛాన్స్
- దేశవాళీ టీ20ల్లో ఇషాన్ కెప్టెన్సీ రికార్డు అదుర్స్
Ishan Kishan : ఐపీఎల్ 2026 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇషాన్ కిషన్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో అతడు సీజన్లో (ఐపీఎల్ 2026) కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతడు వచ్చే వరకు ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ సారథ్య బాధ్యతలను నిర్వర్తించనున్నట్లు ఎస్ఆర్హెచ్ తెలిపింది. ఇక అభిషేక్ శర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇషాన్ కిషన్‌ను సారథిగా నియమించడంతో ఇప్పుడు అందరి దృష్టి అతడిపైనే ఉంది. ఈ క్రమంలో ఇషాన్ కెప్టెన్సీ రికార్డు ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
Dinesh Karthik : ముచ్చటగా మూడోసారి తండ్రైన దినేశ్ కార్తీక్.. కోహ్లీ ఏం మెసేజ్ చేశాడంటే?
ఐపీఎల్లో ఓ జట్టుకు నాయకత్వం వహించడం ఇషాన్ కు ఇదే తొలిసారి. అయితే.. దేశవాళీలో మాత్రం కెప్టెన్‌గా అతడికి మంచి రికార్డు ఉంది. టీ20 ఫార్మాట్లో జార్ఖండ్‌కు నాయకత్వం వహించాడు. అతడి నాయకత్వంలో జార్ఖండ్.. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025-26 సీజన్ విజేతగా నిలిచింది. దీంతో పాటు ఇషాన్ కెప్టెన్సీ శైలిపై ప్రశంసల వర్షం కురిసింది.
మొత్తంగా ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ 2019 నుండి 29 టీ20 మ్యాచ్‌లలో జట్టుకు నాయకత్వం వహించాడు. ఇందులో 24 మ్యాచ్‌ల్లో ఇషాన్ తన జట్టును గెలిపించుకున్నాడు.
ఇదిలా ఉంటే.. ఇషాన్ కిషన్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్ 2026లో 9 మ్యాచ్‌ల్లో 35.22 సగటు 193.29 స్ట్రైక్‌రేటుతో 317 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్థశతకాలు ఉన్నాయి. అయితే.. ఐపీఎల్లో సారథ్యం వహించడం అంత ఈజీ కాదు. ఈ నేపథ్యంలో అతడు ఎస్ఆర్హెచ్ జట్టును ఎలా నడిపిస్తాడు అన్న ఆసక్తికరంగా మారింది.
