New Spyware Attack : బాబోయ్ కొత్త స్పైవేర్ అటాక్.. ఒక్క క్లిక్‌తో మీ డేటా హ్యాకర్ల చేతుల్లోకి.. ఐఫోన్ యూజర్లు వెంటనే ఇలా చేయండి!
New Spyware Attack: కొత్త స్పైవేర్ దాడి అంట.. ఆపిల్ యూజర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేయకూడదు. మిలియన్ల మంది ఐఫోన్ యూజర్లకు డేంజర్ లో ఉన్నారు.. ఎలా సేఫ్ గా ఉండాలో ఇప్పుడు చూద్దాం..
New Spyware Attack
- లక్షలాది ఐఫోన్ యూజర్లే లక్ష్యంగా స్వైవేర్ అటాక్
- డార్క్ స్వర్డ్ స్పైవేర్ ఎలా వ్యాపిస్తుందో తెలుసా?
- ఈ ఐఫోన్ ఐఓఎస్ వెర్షన్లలోనే ఎక్కువ ముప్పు
- ఆపిల్ ఐఫోన్ యూజర్లు వెంటనే ఇలా చేయండి
New Spyware Attack : ఆపిల్ ఐఫోన్ యూజర్లు జర జాగ్రత్త. ఐఫోన్లు లక్ష్యంగా కొత్త స్పైవేర్ అటాక్ వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త స్పైవేర్ దాడి సైబర్ సెక్యూరిటీ నిపుణులలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈసారి పెద్ద ఎత్తున ఐఫోన్లు లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం ‘డార్క్స్వర్డ్’ అనే పేరుతో ఈ మాల్వేర్ మిగతా మాల్వేర్ మాదిరిగా చిన్నపాటిది కాదు.. ఈ స్పైవేర్ ఒకసారి డివైజ్ ల్లోకి చొరబడిందంటే అంతే సంగతులు..
మీ వ్యక్తిగత వివరాల నుంచి క్రిప్టోకరెన్సీ వాలెట్ సమాచారం వరకు పర్సనల్ డేటాను హ్యాక్ చేయగలదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. కొన్నిసార్లు కేవలం ఏదైనా అనుమానాస్పద వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసినా కూడా ఈ స్పైవేర్ మాల్వేర్ వెంటనే డివైజ్ ల్లోకి ఇంజెక్ట్ అయిపోతుంది. డివైజ్ లోకి చొరబడింది అనే విషయం కూడా తెలియదు. ఆపిల్ యూజర్లు ఏం చేయాలి? ఏం చేయకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
డార్క్ స్వర్డ్ స్పైవేర్ ఎలా వ్యాపిస్తుంది? :
లుక్అవుట్, ఐవెరిఫై, గూగుల్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థలు షేర్ చేసిన పరిశోధనల ప్రకారం.. ఈ స్పైవేర్ అనేది హ్యాక్ చేసిన వెబ్సైట్ నెట్వర్క్ ద్వారా వ్యాపిస్తోంది. ఇందులో చాలా వెబ్సైట్ల సోర్సెస్ ఉక్రెయిన్ వంటి ప్రాంతాలకు చెందినవిగా గుర్తించారు. పాత iOS వెర్షన్లను ముఖ్యంగా iOS 18.4, iOS 18.6.2 మధ్య వెర్షన్లను వాడుతున్న వినియోగదారులు ఎక్కువగా ఈ స్పైవేర్ అటాక్ బారిన పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ స్పైవేర్ అటాక్ అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది. క్లిక్‌లు, డౌన్లోడ్ లేదా డివైజ్ పర్మిషన్ అవసరమయ్యే మాల్వేర్లా కాకుండా ఈ ఎక్స్‌ప్లాయిట్ ఏం చేయకపోయినా యాక్టివేట్ అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. మీ ప్రమేయం లేకుండానే మీ డివైజ్ లోని ప్రతి ఫైల్ లోకి ఇంజెక్ట్ అవుతుంది. చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది.
ఎవరి డివైజ్ డేంజర్లో..? :
నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 22 కోట్ల నుంచి 27 కోట్ల ఐఫోన్లు ఇప్పటికీ ఎఫెక్ట్ అయిన సాఫ్ట్వేర్ వెర్షన్లతో రన్ అవుతున్నాయి. ముఖ్యంగా అప్డేట్ చేయకుండా ఉంటేవారిలో ఎక్కువ సంఖ్యలో ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది.
ఈ కొత్త స్పైవేర్ అటాక్ ముప్పు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదు.. సౌదీ అరేబియా, టర్కీ, మలేషియా, ఉక్రెయిన్‌తో సహా పలు దేశాల్లో ఇదే వెర్షన్ డివైజ్ లు ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. దీని వెనుక కమర్షియల్ నిఘా సంస్థలు, ప్రభుత్వ మద్దతు ఉన్న బృందాలు కూడా ఉండవచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు.
ఆపిల్ ఏం చెప్పిందంటే? :
క్యూపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్ ఈ సమస్యను గుర్తించి వెంటనే యూజర్లను అలర్ట్ చేసింది. ఈ లోపాలను కొత్త iOS అప్డేట్లలో సవరించినట్టు స్పష్టం చేసింది. హానికరమైన డొమైన్లను సఫారీ వేగంగా బ్లాక్ చేస్తోందని ఆపిల్ పేర్కొంది.
యూజర్లు ఏం చేయాలంటే? :
దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది.. అది మీ ఐఫోన్‌ను లేటెస్ట్ iOS వెర్షన్‌కు అప్డేట్ చేసుకోవడమే. గుర్తుతెలియని వెబ్సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇంటర్నల్ సెక్యూరిటీ ఫీచర్లను ఎనేబుల్ చేసి ఉండాలి. ఎలాంటి భయాందోళన అవసరం లేదు. నిర్లక్ష్యం చేయకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ ఐఫోన్ డివైజ్ సేఫ్ ఉన్నట్టే..
