BiggBoss Shrihan : హీరోగా మారుతున్న బిగ్‌బాస్ శ్రీహాన్.. ఆవారా జిందగి అంటూ..

షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో పేరు సంపాదించుకున్న శ్రీహన్, నటి సిరి హనుమంత్ ప్రియుడిగా మరింత పాపులర్ అయ్యాడు. ఈ సీజన్ బిగ్‌బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు శ్రీహాన్. శ్రీహన్ మెయిన్ లీడ్ లో..........

BiggBoss Shrihan :  హీరోగా మారుతున్న బిగ్‌బాస్ శ్రీహాన్.. ఆవారా జిందగి అంటూ..

BiggBoss Shrihan turned as Hero

BiggBoss Shrihan :  ఈ మధ్యకాలంలో వచ్చిన ఫన్ ఓరియెంటెడ్ సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాయి. F2, జాతి రత్నాలు, F3 లాంటి సినిమాలు ఆడియన్స్ కి కావాల్సినంత వినోదం పంచాయి. నేటితరం ఆడియన్స్ కూడా ఇలాంటి ఫన్ కాన్సెప్ట్ సినిమాలకు బాగా కనెక్ట్ అవుతున్నారు. థియేటర్స్ లో కామెడీ ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ కావడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి తెలుగు ప్రేక్షకుల కోసం ”ఆవారా జిందగి” రూపంలో మరో ఫన్ ఎంటర్ టైనర్ రాబోతోంది.

షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో పేరు సంపాదించుకున్న శ్రీహన్, నటి సిరి హనుమంత్ ప్రియుడిగా మరింత పాపులర్ అయ్యాడు. ఈ సీజన్ బిగ్‌బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు శ్రీహాన్. శ్రీహన్ మెయిన్ లీడ్ లో ఆవారా జిందగి సినిమాను ఆడియన్స్ కోరుకునే విధంగా కామెడీ ప్రధానాంశంగా తెరకెక్కించారు. నలుగురు కుర్రోళ్ళ నడుమ నడిచే ఫుల్ లెంగ్త్ కామెడీతో ఈ సినిమాను గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. జీరో లాజిక్ 100% ఫన్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రానుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించేలా ఈ సినిమా కథ ఎంచుకొని ఇంట్రెస్టింగ్ లొకేషన్స్ లో తెరకెక్కించారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

Salman Khan : సౌత్, నార్త్ కలుద్దాం.. 300 కాదు 3000 కోట్ల వ్యాపారం చేద్దాం..

విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దేప శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ ఆవారా జిందగీ రూపొందుతోంది. ఈ చిత్రానికి నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే, సద్దాం, టార్జాన్ ప్రధాన పాత్రల్లో ఆధ్యంతం కామెడీ యాంగిల్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీహన్ బిగ్‌బాస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలుపెట్టనున్నారు చిత్ర యూనిట్.