Salman Khan : సౌత్, నార్త్ కలుద్దాం.. 300 కాదు 3000 కోట్ల వ్యాపారం చేద్దాం..

ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ''‘కొందరు హాలీవుడ్‌ సినిమాల్లో పని చేయాలనుకుంటారు. నేనైతే సౌత్.................

Salman Khan : సౌత్, నార్త్ కలుద్దాం.. 300 కాదు 3000 కోట్ల వ్యాపారం చేద్దాం..

Salman Khan :  మలయాళం సూపర్ హిట్ సినిమా లూసిఫర్ ని తెలుగు గాడ్‌ఫాదర్‌ గా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. మోహనరాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించగా నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, పూరి జగన్నాథ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబరు 5న గాడ్ ఫాదర్ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్‌ కానుంది. ప్రమోషన్స్ తో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నారు.

తాజాగా హిందీలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ”‘కొందరు హాలీవుడ్‌ సినిమాల్లో పని చేయాలనుకుంటారు. నేనైతే సౌత్ సినిమాల్లోనే నటించాలనుకుంటున్నాను. హిందీ, సౌత్ నటులు కలిసి పనిచేస్తే వచ్చే లెక్కలు ఊహించని విధంగా ఉంటాయి. చిరంజీవి అభిమానులు నన్ను ఆదరిస్తే, నా అభిమానులు తనకి అభిమానులైతే సంఖ్య భారీగా పెరుగుతుంది.”

BiggBoss 6 Day 27 : హౌస్ కంటెస్టెంట్స్ కి టిప్పులిచ్చి మరీ క్లాస్ పీకిన నాగార్జున..

”మనం విడివిడిగా సినిమాలు చేస్తే రూ.300-రూ.400 కోట్ల సినిమా అవుతుంది. సౌత్, నార్త్ కలిసి సినిమాలు చేస్తే, మనందరం కలిసి పనిచేస్తే రూ.3,000-రూ.4,000 కోట్ల సినిమాలు వస్తాయి. మరిన్ని మల్టీస్టారర్ సినిమాలు రావాలి. నా తొలి తెలుగు సినిమా ‘గాడ్‌ఫాదర్‌’ తప్పకుండా అందరికి నచ్చుతుంది” అని అన్నారు.