Rajinikanth: ఒక్క సినిమా సక్సెస్‌తోనే సూపర్ స్టార్‌కు కథ వినిపించిన డైరెక్టర్!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ నెల్సన్ డైరెక్షన్‌లో ‘జైలర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా తరువాత తలైవా ఎవరితో సినిమా చేస్తాడా అని అటు తమిళ అభిమానులతో పాటు తెలుగు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. సూపర్ స్టార్‍‌తో ఏ స్టార్ డైరెక్టర్ సినిమాను తెరకెక్కిస్తాడా అని అందరూ చూస్తున్న తరుణంలో, ఒక యంగ్ డైరెక్టర్ రజినీకాంత్‌ను లైన్‌లో పెట్టే పనిలో ఉన్నాడు.

Rajinikanth: ఒక్క సినిమా సక్సెస్‌తోనే సూపర్ స్టార్‌కు కథ వినిపించిన డైరెక్టర్!

Bimbisara Director Vasishta Narrates Story To Rajinikanth

Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ నెల్సన్ డైరెక్షన్‌లో ‘జైలర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటోంది. ఇక ఈ సినిమా తరువాత తలైవా ఎవరితో సినిమా చేస్తాడా అని అటు తమిళ అభిమానులతో పాటు తెలుగు ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. సూపర్ స్టార్‍‌తో ఏ స్టార్ డైరెక్టర్ సినిమాను తెరకెక్కిస్తాడా అని అందరూ చూస్తున్న తరుణంలో, ఒక యంగ్ డైరెక్టర్ రజినీకాంత్‌ను లైన్‌లో పెట్టే పనిలో ఉన్నాడు.

Rajinikanth : నేను చిన్న క్యారెక్టర్ అడిగినా మణిరత్నం ఇవ్వలేదు.. నేను, కమల్‌, శ్రీదేవి, విజయ్‌ కాంత్‌లతో ఈ సినిమా తీద్దాం అనుకున్నాం..

తెలుగులో కేవలం ఒకే ఒక హిట్ సినిమాతో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు వశిష్ట, ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. నందమూరి కళ్యాణ్ రామ్‌తో ఫిక్షన్ మూవీగా ‘బింబిసార’ను తెరకెక్కించి, బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో హిట్ కోసం ఎదురుచూస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్‌కు సైతం ఊహించని సక్సెస్‌ను అందించాడు ఈ డైరెక్టర్. ఇక ఇప్పుడు ఈ డైరెక్టర్ ఓ కథను సూపర్ స్టార్ రజినీకాంత్‌కు వినిపించినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Rajinikanth: రజినీకాంత్ సినిమా డిజాస్టర్‌కు అసలు కారణాలు ఇవేనట!

దర్శకుడు వశిష్ట చెప్పిన కథ విన్న రజినీకాంత్, ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదట. ఒక్కసారి రజినీకాంత్ తన నిర్ణయాన్ని చెబితే, ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నానంటున్నాడు ఈ కుర్ర డైరెక్టర్. మరి బింబిసార చిత్రంతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన డైరెక్టర్ వశిష్ట, సూపర్ స్టార్ రజినీకాంత్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.