Rajinikanth: రజినీకాంత్ సినిమా డిజాస్టర్‌కు అసలు కారణాలు ఇవేనట!

రజినీకాంత్‌తో ముత్తు, నరసింహా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడు కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లింగ’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలను ఈ చిత్ర దర్శకుడు కెఎస్.రవికుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

Rajinikanth: రజినీకాంత్ సినిమా డిజాస్టర్‌కు అసలు కారణాలు ఇవేనట!

Ks Ravikumar Opens About Rajinikanth Lingaa Movie Disaster

Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుందంటే కేవలం తమిళనాటే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పండగ వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రజినీ సినిమాలకు ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక రజినీ కెరీర్‌లో రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన దర్శకుడితో హ్యాట్రిక్ సినిమాను చేస్తున్నాడంటే.. ఆ సినిమా రిలీజ్ అవుతుందంటే అప్పుడు ఎలాంటి వాతావరణం క్రియేట్ అవుతుందో మనందరం చూశాం. ఇలాంటి సీన్ దర్శకుడు కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లింగ’ సినిమా సమయంలో కనిపించింది.

Rajinikanth : ఎట్టకేలకు తలైవా 169.. బీస్ట్ దర్శకుడితో జైలర్ గా రజినీ..

అప్పటికే రజినీకాంత్‌తో ముత్తు, నరసింహా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ఈ డైరెక్టర్.. ముచ్చటగా మూడోసారి రజినీతో కలిసి సినిమా చేస్తుండటంతో లింగ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ.. ఈ సినిమా రిలీజ్ తరువాత సీన్ రివర్స్ అయ్యింది. ఈ సినిమా రజినీకాంత్ కెరీర్‌లో ఘోరమైన డిజాస్టర్ మూవీగా నిలిచింది. అయితే ఈ సినిమా ఎందుకు డిజాస్టర్ అయ్యిందనే విషయంపై తాజాగా మరోసారి చర్చ సాగుతోంది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలను ఈ చిత్ర దర్శకుడు కెఎస్.రవికుమార్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

Rajinikanth: రజినీ కోసం రంగంలోకి మరో డైరెక్టర్

నిజానికి తాను ముందుగా అనుకున్న స్క్రిప్టు వేరని.. కానీ లింగ సినిమా రిలీజ్ సమయానికి బయటకు వచ్చిన స్క్రిప్టు వేరని ఆయన అన్నారు. సినిమా కథ విషయంలో రజినీకాంత్ ఎలాంటి జోక్యం చేసుకోలేదని.. అయితే స్క్రిప్టులో కొన్ని మార్పులు మాత్రమే సూచించడంతో, హడావుడిగా అప్పటికప్పడు కొన్ని మార్పులు చేశామని.. ఇక సినిమా క్లైమాక్స్‌లో వచ్చే బెలూన్ ఫైట్ తాము ముందుగా అనుకున్నది కాదని.. చివర్లో హడావుడిగా పెట్టాల్సి వచ్చిందని కెఎస్.రవికుమార్ తెలిపారు. ఇక రజినీకాంత్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలనే తొందర్లో ఈ సినిమాను ఫినిష్ చేసి రిలీజ్ చేయడంతో ఔట్‌పుట్ సరిగా రాలేదని ఆయన తెలిపారు. ఇలా లింగ ఫ్లాప్‌కు గల కారణాలలో కొన్నింటిని దర్శకుడు ఇప్పుడు ఎందుకు వెల్లడించారనేది కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.