Bimbisara: బింబిసార ఓటీటీ రైట్స్‌కు భారీ రేటు!

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘బింబిసార’ మూవీ ఈ నెల 5వ తేదీన రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, తాజాగా ఈ చిత్ర ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

Bimbisara: బింబిసార ఓటీటీ రైట్స్‌కు భారీ రేటు!

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బింబిసార’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ఫాంటసీ యాక్షన్ చిత్రంగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండగా, ఇందులో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్లు ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఆగస్టు 5న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కాగా, భారీ ప్రమోషన్స్ తో చిత్ర యూనిట్ ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు.

Bimbisara: బింబిసార కోసం అఖండ ఆగమనం..?

ఇక ఈ సినిమాకు గతంలో ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిజిటల్ రైట్స్ కోసం భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు ముందుకు రాగా, కళ్యాణ్ రామ్ ఆ సమయంలో ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడు. అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ దగ్గరపడటంతో ఈ చిత్ర ఓటీటీ రైట్స్ ను భారీ రేటుకు జీ5కు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది. కాగా, ఈ మూవీలో ఆయన రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడు.

Bimbisara : బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించగా, సంయుక్తా మీనన్, కేథరిన్ త్రేజాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేయగా, ఇప్పటికే ఈ సినిమాను చూశానని.. ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో చెప్పడంతో బింబిసార చిత్రంపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని క్రియేట్ చేశారు. మరి భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న బింబిసార బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.