BoyapatiRAPO: దసరా రోజున గట్టిగా ఇస్తామంటోన్న బోయపాటి-రామ్!

టాలీవుడ్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను, యంగ్ డైరెక్టర్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్, ఆ తరువాత ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌ను అక్టోబర్ 5న దసరా రోజు నుండి గట్టిగా ఇస్తామంటున్నారు చిత్ర యూనిట్.

BoyapatiRAPO: దసరా రోజున గట్టిగా ఇస్తామంటోన్న బోయపాటి-రామ్!

Boyapati Sreenu Ram Pothineni To Give Updates About BoyapatiRAPO On Dasara

BoyapatiRAPO: టాలీవుడ్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను, యంగ్ డైరెక్టర్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్, ఆ తరువాత ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమాకు సంబంధించి ఏం జరుగుతుందనే ఆసక్తి అటు అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది.

BoyapatiRAPO: తమ సినిమాకు రెమ్యునరేషన్ వదులుకున్న బోయపాటి-రామ్‌లు

అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌ను అక్టోబర్ 5న దసరా రోజు నుండి గట్టిగా ఇస్తామంటున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాను బోయపాటి మార్క్ మాస్, రామ్ పోతినేని మార్క్ ఎనర్జీతో కలిపి చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలోని అదిరిపోయే అప్డేట్ కోసం దసరా రోజు వరకు ఆగాల్సిందేనట. అయితే ఈ సినిమాలో రామ్ పోతినేని సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

Ram-Boyapati: క్రేజీ కాంబినేషన్.. మరోసారి డ్యూయెల్ రోల్‌లో ఉస్తాద్ హీరో?

అటు ఈ సినిమాకు సంబంధించిన మెయిన్ క్యాస్టింగ్ గురించి కూడా చిత్ర యూనిట్ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి దసరా రోజున ఈ పవర్‌ప్యాక్డ్ కాంబినేషన్ మూవీ నుండి ఎలాంటి అప్డేట్స్ వస్తాయా అనేది చూడాలి. ఇక ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ చిట్టూరి పాన్ ఇండియా మూవీగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.