Chandoo Mondeti : కార్తికేయ 3కి కూడా అవకాశం ఉంది.. మొదటిభాగంలోని హీరో తప్ప మిగిలిన పాత్రలు కార్తికేయ 2లో ఉండవు..

చందూ మొండేటి మాట్లాడుతూ.. ''హీరో పాత్ర మాత్రమే ఇందులో కొనసాగుతుంది. కార్తికేయలో హీరో మెడికల్ స్టూడెంట్ గా కనిపిస్తే, ఇందులో డాక్టర్‌గా కనిపిస్తాడు. కథ మొదలు కాగానే............

Chandoo Mondeti : కార్తికేయ 3కి కూడా అవకాశం ఉంది.. మొదటిభాగంలోని హీరో తప్ప మిగిలిన పాత్రలు కార్తికేయ 2లో ఉండవు..

Karthikeya 2

Chandoo Mondeti :  నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్ లో ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది కార్తికేయ 2. అనేక వాయిదాల అనంతరం ఆగస్టు 13 న ఈ సినిమా రిలీజ్ కానుంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సారి కృష్ణుడి కథని ఆధారంగా తీసుకున్నారు. కార్తికేయ కంటే పార్ట్ 2 మరింత ఆసక్తికరంగా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

Shilpa Shetty Leg Broken: షూటింగ్‌లో కాలు విరగ్గొట్టుకున్న హీరోయిన్..!

ఈ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ చందూ మొండేటి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని వెల్లడించారు. చందూ మొండేటి మాట్లాడుతూ.. ”హీరో పాత్ర మాత్రమే ఇందులో కొనసాగుతుంది. కార్తికేయలో హీరో మెడికల్ స్టూడెంట్ గా కనిపిస్తే, ఇందులో డాక్టర్‌గా కనిపిస్తాడు. కథ మొదలు కాగానే హీరో పాత్ర వేరే ఊరికి వెళ్ళిపోతుంది కాబట్టి మొదటి భాగంలోని మిగతా పాత్రల్ని కొనసాగించే అవకాశం రాలేదు. మొదటి భాగంలో హీరో ఓ సాహసోపేతమైన ప్రయాణం ఎలా చేశాడో, ఇందులో కూడా అలాంటి ఓ ప్రయాణమే చేస్తాడు. ఈసారి కథ శ్రీకృష్ణుడి చుట్టూ సాగుతుంది. తొలి సినిమా చూడకపోయినా ఈ సినిమా బాగానే అర్ధమవుతుంది. ఈ కథని ఇంకా చాలా చెప్పొచ్చు. కార్తికేయ 2 కి ప్రేక్షకుల నుంచి వచ్చే ఆదరణని బట్టి మూడో భాగంపై కూడా ఆలోచిస్తాం. సినిమా మంచి విజయం సాధిస్తే కార్తికేయ 3 కూడా ఉండొచ్చు” అని తెలిపారు.